పొలిటికల్‌ సర్కిళ్లలో ఒకటే చర్చ.. ఎవరీ ‘రాజమాత’ | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ సర్కిళ్లలో ఒకటే చర్చ.. ఎవరీ ‘రాజమాత’

Published Mon, Mar 25 2024 5:06 PM

Who is Amrita Roy - Sakshi

కోల్‌కతా: పార్లమెంటులో డబ్బులకు ప్రశ్నలడిగిన వ్యవహారంలో ఎంపీ సభ్యత్వం కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ) నేత మహువా మొయిత్రా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణా నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. మరి ఈసారి మహువా గెలుస్తారా? లేదా? అనే సంగతి పక్కన పెడితే.. ఆమెపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి రాజమాత అమ్రితా రాయ్‌కి గురించి పొలిటికల్‌ సర్కిళ్లలో ఒకటే చర్చ మొదలైంది. ఇంతకీ ఈ రాజమాత ఎవరు? 

కృష్ణా నగర్‌ లోక్‌సభ నియోజవర్గంలో మొత్తం 14 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా.. ఆ ఎన్నికల్లో బీజేపీ 1999 ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. నాటి నుంచి ఆ నియోజకవర్గంలో కమలం గెలుపు కత్తిమీద సాములా మారింది. అయితే ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్న కమలం.. మహువా మొయిత్రా మీద ఏరికోరి అమ్రితా రాయ్‌ని నిలబెట్టింది. బీజేపీ 111 అభ్యర్ధులతో ఐదువ జాబితాను విడుదల చేసింది. అందులో కృష్ణా నగర్‌ లోక్‌సభ స్థానం బీజేపీ అభ్యర్ధిగా రాజమాత అమ్రితా రాయ్‌ని ఖరారు చేసింది. 

అమ్రితా రాయ్ ఎవరు?

 • అమ్రితా రాయ్ కృష్ణానగర్ రాజకుటుంబానికి చెందినవారు. నియోజకవర్గానికి చెందిన 'రాజ్‌బరీ రాజమాత' (రాచరికపు రాణి తల్లి) గా ప్రసిద్ధి
   
 • మొయిత్రాకు పోటీగా బీజేపీ రాజ మహారాజా కృష్ణచంద్ర కుటుంబ సభ్యులను పోటీకి దించవచ్చని ఊహాగానాలు ఊపందుకున్న తర్వాత బీజేపీ ఢిల్లీ అధిష్టానం అమ్రితారాయ్‌ని కృష్ణానగర్‌ అభ్యర్థిగా ప్రకటించింది.
   
 • ఈ ఏడాది మార్చి 20న పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత, సువేందు అధికారి సమక్షంలో రాయ్ అధికారికంగా బీజేపీలో చేరారు.
   
 • పలు నివేదికల ప్రకారం.. కృష్ణా నగర్‌ జిల్లా నాయకత్వమే మొదట అమ్రితా రాయ్‌ను లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దించేతే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.  ఆ తర్వాతే కమలం పెద్దలు రంగంలోకి దిగారు.
   
 • ముఖ్యంగా, కృష్ణనగర్‌ లోక్‌సభ అభ్యర్థిగా మహారాజా కృష్ణ చంద్ర రాయ్ రాజమహల్‌ నుంచి తొలిసారి రాజకీయాలతో అనుసంధానించారు. రాష్ట్రంలో వీరి వారసత్వం హవా నేటికీ కొనసాగుతుంది.
   
 • ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత రాయ్ మాట్లాడుతూ “నాడియా చరిత్రకు రాజు కృష్ణచంద్ర చేసిన కృషి గురించి అందరికి తెలుసు. చరిత్రలో కృష్ణానగర్ రాజకుటుంబం పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. నేను ఎన్నికల రంగంలోకి రాచరికపు కోడలుగా కాకుండా సాధారణ ప్రజల గొంతుకగా నిలిచాను. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను అని వ్యాఖ్యానించారు.
   
 • వెస్ట్‌ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు బీజేపీ మొత్తం 38 మధ్య అభ్యర్ధులను ఖరారు చేసింది. ఐదవ జాబితాలో 19 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది.

Advertisement
 
Advertisement