సునీత దంపతులు చంద్రబాబును కలవడానికి కారణం ఏంటి? | What Reason Sunitha And Her Husband To Meet Chandrababu: Sailajanath | Sakshi
Sakshi News home page

సునీత దంపతులు చంద్రబాబును కలవడానికి కారణం ఏంటి?

Oct 8 2026 4:50 PM | Updated on Oct 8 2026 5:49 PM

What Reason Sunitha And Her Husband To Meet Chandrababu: Sailajanath

సాక్షి, తాడేపల్లి: వివేకా హత్య కేసుతో చంద్రబాబు రాజకీయ చదరంగం ఆడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. వివేకా కేసులో న్యాయం జరగాలా? లేక చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు నెరవేరాలా?. సునీత దంపతులు చంద్రబాబును కలవటానికి కారణం ఏంటి?. అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసుల వార్తలు వచ్చిన వెంటనే సునీత దంపతులు.. చంద్రబాబును ఎందుకు కలిశారు’’ అంటూ శైలజానాథ్‌ ప్రశ్నించారు.

‘‘వివేకా హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని చంద్రబాబును కలిశారా?. లేక కడప జెడ్పీ చైర్మన్ పదవి కోసం చర్చించారా?. సునీత కుటుంబానికి రాజకీయ పదవుల విషయంలో చంద్రబాబు ఏమైనా హామీలు ఇచ్చారా? ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడినప్పుడల్లా పాత కేసులకు కొత్త స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. ప్రజలు సమాధానాలు అడిగితే క్రైమ్ థ్రిల్లర్ వినిపిస్తున్నారు. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంది చంద్రబాబూ.. కానీ ఎడిటింగ్‌లోనే మీ రాజకీయ వ్యూహం బయటపడుతోంది’’ అంటూ శైలజానాథ్‌ చురకలు అంటించారు.

‘‘గొడ్డలి పార్టీ అంటూ చంద్రబాబు విమర్శిస్తున్నారు.. మరి వెన్నుపోటు పార్టీ చరిత్రను ప్రజలు మర్చిపోతారా?. వివేకా హత్య కేసులో నిందితులు చంద్రబాబు దగ్గరకు ఎందుకు వస్తున్నారు?. టీడీపీ కార్యాలయానికి దస్తగిరి కుటుంబం వచ్చారన్న వార్తలపై చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదు?. వివేకా హత్య కేసులో నిందితులకు రాష్ట్ర మంత్రులు మద్దతుగా తెలపడం వెనుక కారణమేంటి?. సునీత ఏనాడైనా తన తండ్రి కేసును త్వరగా ముగించాలని ఎందుకు కోరటం లేదు?. వివేకా హత్య కేసులో రాజకీయ ఆరోపణలు మానుకోవాలి

..ఈడీ స్వతంత్రంగా వ్యవహరిస్తోందా? లేక చంద్రబాబు ప్రభుత్వ సిట్ కథనాన్నే కొనసాగిస్తోందా?. రాష్ట్రంలో కరువు, రైతుల కష్టాలు, డీఎస్సీ అక్రమాలపై సమాధానం లేదు. చంద్రబాబుకు గొడ్డలి రాజకీయాలు తప్ప ప్రజల సమస్యలు పట్టడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడే వివేకానందరెడ్డి గుర్తుకొస్తారా?. ఆయన మరణానికి న్యాయం జరగాల్సిన అవసరం మిగతా రోజుల్లో ఉండదా?’’ అంటూ శైలజానాథ్‌ నిలదీశారు.

సునీత కుటుంబానికి పదవులు? చంద్రబాబు ను కలవడానికి కారణం కూడా.. షాకింగ్ నిజాలు

ఇదీ చదవండి: చంద్రబాబుతో సునీత దంపతుల భేటీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement