ఏపీలో పొత్తులపై  ఇప్పుడేమీ మాట్లాడలేం: అమిత్‌ షా | We Cant talk About Alliances in AP Now Amit Shah | Sakshi
Sakshi News home page

ఏపీలో పొత్తులపై  ఇప్పుడేమీ మాట్లాడలేం: అమిత్‌ షా

Feb 10 2024 12:17 PM | Updated on Feb 10 2024 1:22 PM

 We Cant talk About Alliances in AP Now Amit Shah - Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు కోసం తెగ వెంపర్లాడుతున్న టీడీపీకి ఏం జరుగుతుందో అన్న భయంలో కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ నుంచి ఏం కబురు వస్తుంది? తమతో పొత్తుకు కమలనాథులు ఒప్పుకుంటారా? లేక తిరస్కరిస్తారా అన్న డోలాయమానంలో కొట్టుమిట్టాడుతున్నాడు చంద్రబాబు. ఈ లోగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నర్మగర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు టిడిపిలో గుబులు రేపుతున్నాయి.

అమిత్‌షా ఏమన్నాడు?

శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయాలు, వేర్వేరు రాష్ట్రాల్లో పొత్తుల గురించి మీడియాతో మాట్లాడారు. ఉత్తరాదిన మెజార్టీ రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేయనున్న బీజేపీ.. దక్షిణాదిన మాత్రం నమ్మదగ్గ, విశ్వసనీయమైన మిత్రుల కోసం చూస్తోంది. దీనికి సంబంధించి మాట్లాడిన అమిత్‌షా.. ఇప్పటికిప్పుడు ఏపీలో పొత్తులపై ఏమీ మాట్లాడలేమన్నారు. ఇది ఓ రకంగా చంద్రబాబు & కోకు నిరాశ కలిగించేదే. సుదీర్ఘంగా వెయిట్‌ చేసి ఢిల్లీలో అమిత్‌షాను కలిసిన చంద్రబాబు.. వీలైనంత వేగంగా పొత్తుల ప్రక్రియ కొనసాగించాలన్న ఆత్రుతలో ఉన్నాడు. అయితే అమిత్‌షా మాత్రం అంత వేగిరపాటు ఎందుకన్నట్టుగా సంకేతాలిస్తున్నారు.

బాబు.. చేసిన పనులు మరిచిపోయావా?

ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, అధికార పక్షం వైఎస్సార్‌సిపిని ఎదుర్కొనేందుకు ఏమాత్రం ధైర్యం లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు కూడా తెలుసు. అందుకే పొత్తుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కూడా కలిశాడు. పొత్తు అవశ్యకమని, పవన్‌తో పొత్తు పెట్టుకున్నా.. అంత ప్రయోజనం లేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి తమకు సహయ సహకారాలు కావాలని అమిత్‌షాను కోరాడు చంద్రబాబు.

నిజానికి చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికలంటే పొత్తులనే వరకు వచ్చాడు. ఒంటరిగా పోటీ చేయలేక పక్కబలంతో తన ప్రయోజనాలు నెరవేర్చుకోవడంలో చంద్రబాబు దిట్ట అంటారు తెలుగు తమ్ముళ్లు. అంతెందుకు 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కలిసి పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. అది దేశం కోసం పెట్టుకున్న పొత్తుగా అభివర్ణించాడు. దేశమంతా తిరిగి బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం నడిపాడు. ఢిల్లీలో ధర్నాలు చేసి మోదీపై వ్యక్తిగత విమర్శలు చేశాడు. అమిత్‌షా తిరుమలకు వస్తే చెప్పులు వేయించిన ఘనత కూడా చంద్రబాబుదే. అదే చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడుతుండడం విచిత్రమైన విషయమే.

చంద్రబాబు విషయంలో బీజేపీ కాస్తా ఊగిసలాడుతోంది. ఎందుకనో చంద్రబాబును కమలనాథులు విశ్వసనీయమైన మిత్రుడిగా పరిగణించడం లేదు. ఏ ఎండకా గొడుగు పట్టడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబును నమ్ముకుంటే.. ఎప్పటికీ ఇక్కడ ఎదగలేమన్న నిశ్చితాభిప్రాయంలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement