డోర్నకల్‌: ఎమ్మెల్యేకు వ్యతిరేకత.. పుంజుకుంటున్న కాం‍గ్రెస్‌ | Sakshi
Sakshi News home page

డోర్నకల్‌: ఎమ్మెల్యేకు వ్యతిరేకత.. పుంజుకుంటున్న కాం‍గ్రెస్‌

Published Sat, Aug 19 2023 6:13 PM

Warangal: Who Will Next Incumbent Dornakal Constituency - Sakshi

2009 నియోజకవర్గాల పునఃర్విభజన వరకు జనరల్ స్థానంగా ఉన్న డోర్నకల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. పునఃర్విభజనతో ఎస్టీ రిజర్వుడుగా మారింది. జనరల్ స్థానంలో ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్, ప్రస్తుతం ఎస్టీ రిజర్వుస్థానంలో ఎదురీదే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులైన మంత్రి సత్యవతి రాథోడ్, సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ బిఆర్ఎస్ పార్టీలో టికెట్‌ కోసం పోటీ పడ్డారు. కానీ చివరికి అధిష్టానం రెడ్యానాయక్‌కే టికెట్‌ను ఖరారు చేసింది. దాంతో పార్టీ కీలక నేతల్లో అసమ్మతి నెలకొంది. 

ఎన్నికలను ప్రభావితం చేసే ముఖ్య అంశాలు:

గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజక వర్గం ఇది. ముఖ్యంగా విద్యా, వైద్యం,స్థానిక సమస్యలు..డబుల్ బెడ్రూం ఇళ్ళు, దళిత బందు పతకాలను పరిమితంగా అమలు చేయడం. సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఏడు సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచిన మంత్రిగా పనిచేసినప్పటికి మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళిన నిలదీసే పరిస్తితి ఏర్పడింది.

 ప్రధాన పార్టీల అభ్యర్థులు :

బీఆర్ఎస్

  • రెడ్యా నాయక్ (కన్‌ఫాం)

కాంగ్రెస్ పార్టీ :

  • జాటోత్ రామ చoద్రునాయక్ (ఆశావాహులు)
  • మలోత్ నెహ్రూ నాయక్‌ (ఆశావాహులు)
  • ననావత్ భూపాల్ నాయక్(ఆశావాహులు)

బిజేపి పార్టీ :

  • లక్ష్మణ్‌ నాయక్‌ (ఆశావాహులు)

రాజకీయ అంశాలు : 

ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో టిఆర్ఎస్ పాగా వేసి తన బలం పెంచుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్ కాస్త పుంజుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాను ఏలిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆయన ప్రభావం డోర్నకల్ నియోజకవర్గంలో చూపే పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరడంతో ఖమ్మం ప్రక్కన డోర్నకల్ పై పొంగులేటి ప్రభావం కనిపించే పరిస్థితి ఉంది.

వృత్తిపరంగా ఓటర్లు :

  • గిరిజనులు రైతులు ఎక్కువగా ఉంటారు

మతం/కులం వారిగా ఓటర్లు :

  • ఎస్టీ ఓటర్లు 92616 మంది
  • బిసి ఓటర్లు 76 వేల మంది
  • ఎస్సీ ఓటర్లు 29401 మంది
  • ముస్లీం మైనార్టీ ఓటర్లు 6464 మంది

నియోజకవర్గంలో బౌగోళిక పరిస్థితులు :

వాగులు : పాలేరు, ఆకేరు, మున్నేరు

ఆలయాలు : కురవి శ్రీ భద్రకాళీ సమేత వీరద్రస్వామి, నందికొండ గ్రామo శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ, నర్సింహులపేట వెంకటేశ్వర స్వామి ఆలయాలు, మరిపెడ మాకుల వెంకటేశ్వర స్వామి, డోర్నకల్ పురాతన శ్రీరాముల వారి ఆలయం(పెరుమండ్ల సంకిసా), చిన్నగూడూరు మండల కేంద్రం దాశరథీ స్వగ్రామం.

Advertisement

తప్పక చదవండి

Advertisement