సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరమని, ఆయనకు విశాఖ స్టీల్స్ తెలీదు కానీ సుజనా స్టీల్స్ బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. బ్యాంకులను ముంచిన వ్యక్తి సుజనాచౌదరి అని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదని ఇప్పటికే సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ వద్దని నిర్మలాసీతారామన్‌ను కలిశామని,నష్టాలుంటే గట్టెక్కించాలని సూచించామని తెలిపారు.


