Tula Uma Joined In BRS: బీసీని బీజేపీ సీఎం చేయడం ఒక కల: బీఆర్‌ఎస్‌లో చేరిక తర్వాత తుల ఉమ

Tula Uma Joined BRS Slams BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ తుల ఉమ తన ముఖ్య అనుచరులతో తిరిగి బీఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. సోమవారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కండువా కప్పి ఉమను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో గతంలో కంటే ఉమకు సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్‌ మీడియా సమక్షంలో హామీ ఇవ్వగా..  టికెట్‌ విషయంలో హ్యాండ్‌ ఇచ్చిన  బీజేపీపై ఉమ విమర్శలతో విరుచుకుపడ్డారు. 

కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బీజేపీ టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి.. బీఫాం ఇవ్వకుండా ఇచ్చిన సీటును గుంజుకోవడం చాలా బాధాకరం. ఇది మహిళలకే కాకుండా బీసీల పట్ల బీజేపీ వ్యతిరేక వైఖరికి నిదర్శనం. బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చిన బీజేపీ ఉమక్కను(తుల ఉమను ఉద్దేశించి..) అవమానించింది. తెలంగాణ ఉద్యమ కాలం నాటినుంచి సీనియర్ నేతగా, నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలిగా ఉమక్క పనిచేశారు. తెలంగాణ ఆడ బిడ్డగా.. బీఆర్‌ఎస్‌ ఇంటిబిడ్డగా సేవలందించిన ఉమక్కకు బీజేపీలో ఇటువంటి అవమానం జరగడం బాధగా ఉంది.  బలహీన వర్గాల ఆడబిడ్డకు ఇటువంటి అన్యాయం జరగడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాము..నిరసిస్తున్నాం.

.. అందుకే ఆమెను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని సీఎం కేసీఆర్‌ స్వయంగా సూచించారు. ఆయన సూచన మేరకు ఇవాళ ఆహ్వానం పలుకుతున్నాం. మా ఇంటి ఆడబిడ్డగా మా ఆహ్వానం మన్నించి రావడం సంతోషం. గతంలో వున్న హోదాకంటే కూడా మరింత సమున్నత హోదాను, బాధ్యతలను ఉమక్కకు అప్పగిస్తాం. సముచితంగా గౌరవించుకుంటాం. ఇందుకు సంబంధించిన బాధ్యతను నేనే స్వయంగా తీసుకుంటా.  వేములవాడ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని మహిళా అభ్యున్నతి కోసం ఉమక్క సేవలు అవసరం. తుల ఉమక్కకు పుట్టిన గూటికి పునః స్వాగతం’’ అని అన్నారు. 

తుల ఉమా మాట్లాడుతూ.. 
‘‘బీజేపీ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండదు. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి దొంగ దారిన ఇంకొకరికి కేటాయించారు. బీజేపీలో బీసీని ముఖ్యమంత్రి చేయడం అనేది ఒక కల మాత్రమే. అందుకు ఉదాహరణ నేనే. నాకు చెప్పింది ఒకటి.. చేసింది ఒకటి. బీజేపీ కేవలం అగ్రవర్ణాల పార్టీ. కింది స్థాయి కార్యకర్తలను కేవలం వాడుకుంటుంది. గతంలో బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌)లో ఉన్నప్పుడు అనేక హోదాల్లో పని చేశా. కానీ, బీజేపీలో అలాంటి గౌరవం ఏమీ దక్కలేదు. ఇప్పుడు నా సొంత గూటికి వచ్చినట్లు ఉంది. సంతోషంగా ఉంది. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో పార్టీ కోసం పని చేస్తాం. బీజేపీ కార్యకర్తల్లారా.. ఆగం కాకండి. పార్టీ మిమ్మల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటోంది. ఆ విషయం గుర్తించండి’’ అని అన్నారామె.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-11-2023
Nov 13, 2023, 16:16 IST
సాక్షి,ఖమ్మం : తన నామినేషన్‌ తిరస్కరించాలని ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఫిర్యాదుపై మంత్రి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పువ్వాడ అజయ్‌ కుమార్‌ స్పందించారు....
13-11-2023
Nov 13, 2023, 14:55 IST
పీసీసీ అధ్యక్షుడు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రైతులకు మూడు గంటల కరెంట్‌చాలని
13-11-2023
Nov 13, 2023, 14:37 IST
సాక్షి,ఖమ్మం : బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అఫిడవిట్‌ నిబంధనలకు అనుగుణంగా లేదని ఖమ్మం నియోజకవర్గ  కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు....
13-11-2023
Nov 13, 2023, 14:32 IST
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా అగ్రనేత రాహుల్‌ గాంధీ.. 
13-11-2023
Nov 13, 2023, 13:31 IST
సాక్షి,తెలంగాణ:  ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో పాల్గొంటారు. తమ కుటుంబం నుంచి చట్టసభకు ఎన్నికవుతున్నారంటే ఎవరికి...
13-11-2023
Nov 13, 2023, 12:33 IST
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో కొన్నిసార్లు ఆసక్తికర విషయాలు సంతరించుకుంటాయి.  తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నాదమ్ముళ్లు పోటీపడి అందర్ని ఆశ్చర్యానికి గురి...
13-11-2023
Nov 13, 2023, 12:17 IST
దుద్దిళ్ళ శ్రీధర్ బాబు..కాంగ్రెస్‌లో సీనియర్, కీలక నాయకుడు. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లో ఎదిగిన శ్రీధర్‌బాబు సమయోచితంగా వ్యూహాలు రచిస్తూ ముందడుగు...
13-11-2023
Nov 13, 2023, 12:07 IST
ఎన్నికల ద్వారా అధికారంలోకి రావాలని ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి అధికారం కాపాడుకోవాలని...ప్రతిపక్షంలో ఉన్నవారికి పవర్‌లోకి...
13-11-2023
Nov 13, 2023, 12:01 IST
హుస్నాబాద్‌: తెలంగాణ ఉద్యమ సమయంలో వెన్నుదన్నుగా సహాయ సహకారాలు అందించి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఒడితెల కుటుంబం నుంచి...
13-11-2023
Nov 13, 2023, 11:56 IST
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి /పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వం విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ...
13-11-2023
Nov 13, 2023, 11:40 IST
ఆ ఎమ్మెల్యేలకు ప్రజలే ప్రత్యర్థులవుతున్నారు. క్యాడరే ఎదురు తిరుగుతోంది. ప్రజా ప్రతినిధులు పార్టీకి దూరమవుతున్నారు. ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురవడంతో...
13-11-2023
Nov 13, 2023, 10:43 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ స్పీడ్‌ పెంచింది. ఇప్పటికే ప్రచారంలో బీజేపీ నేతలు దూసుకుపోతున్నారు. ఈ...
13-11-2023
Nov 13, 2023, 09:08 IST
'రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులూ ఉండరు.  ఈ నానుడికి ఆ నియోజకవర్గం నిలువెత్తు సాక్ష్యంగా మారింది. ఇప్పుడు...
13-11-2023
Nov 13, 2023, 08:05 IST
ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలోని ప్రత్యర్థులే ప్రమాదకరంగా తయారయ్యారు. అధికార గులాబీ పార్టీ అభ్యర్థికే ఈ...
13-11-2023
Nov 13, 2023, 08:01 IST
సాక్షి, తెలంగాణ: 'కాంగ్రెస్ అంటే గందరగోళం. పార్టీలో నేతల ఇష్టారాజ్యం. ఇక ఎన్నికలొస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపించే దృశ్యాలు అసాధారణంగా ఉంటాయి....
13-11-2023
Nov 13, 2023, 07:54 IST
సాక్షి, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. గులాబీ పార్టీ అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని...
12-11-2023
Nov 12, 2023, 15:51 IST
సాక్షి,హైదరాబాద్‌: కాంగ్రెస్‌ గూండాలు తనపై దాడి చేశారని, తన  కాన్వాయ్‌ని వెంబడిస్తూ దాడి చేశారని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు...
12-11-2023
Nov 12, 2023, 13:58 IST
సాక్షి,హైదరాబాద్‌ : ములుగు ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో మాత్రమే ఉంటారని, ఆమెకు పని తక్కువ ప్రచారం ఎక్కువ అని మంత్రి హరీశ్‌రావు...
12-11-2023
Nov 12, 2023, 13:48 IST
సాక్షి, నిజామాబాద్‌/కామారెడ్డి: కామారెడ్డిలో 29 ఏళ్లుగా గంప గోవర్ధన్‌, షబ్బీర్‌ అలీల మధ్య ఎన్నికలు ఉద్ధండుల మధ్య సమరంలా జరిగేవి. ఇద్దరికీ...
12-11-2023
Nov 12, 2023, 13:01 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: 'బోధన్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్‌ ఆమేర్‌పై పార్టీ కేడర్‌లో తీవ్ర అసమ్మతి నెలకొనగా, ఆయన తీరుపై...



 

Read also in:
Back to Top