తెలంగాణ కొత్త మంత్రుల శాఖలు ఇవే | Telangana New Ministers Portfolios | Sakshi
Sakshi News home page

తెలంగాణ కొత్త మంత్రుల శాఖలు ఇవే

Jun 11 2025 8:01 PM | Updated on Jun 11 2025 10:06 PM

Telangana New Ministers Portfolios

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠకు తెరపడింది. ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

👉గడ్డం వివేక్‌- కార్మిక, మైనింగ్‌ శాఖలు
👉వాకిటి శ్రీహరి- పశుసంవర్థక, స్పోర్ట్‌ అండ్‌ యూత్‌ శాఖలు
👉అడ్లూరి లక్ష్మణ్‌- ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ

కాగా, ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్‌ అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. పార్టీలో సీనియార్టీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి, ఏ శాఖ కట్టబెట్టాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు.

శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చించారు. అనంతరం నిర్ణయం తీసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement