ఎనిమిదేళ్లలో మోదీ ఏం చేశారు: ఎర్రబెల్లి | Telangana: Minister Errabelli Dayakar Rao Slams PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్లలో మోదీ ఏం చేశారు: ఎర్రబెల్లి

Nov 11 2022 2:09 AM | Updated on Nov 11 2022 9:20 AM

Telangana: Minister Errabelli Dayakar Rao Slams PM Narendra Modi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణను పచ్చిగా మోసగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష కార్యాలయంలో బుధవారం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు గంగా ధర్‌గౌడ్, బండా ప్రకాశ్, ఎగ్గె మల్లేశంతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

విభజన చట్టంలో పేర్కొన్న హామీలను విస్మరించడంతో పాటు రాష్ట్రానికి రావలసిన నిధులను ప్రధాని ఆపివేశారని ఆరోపించారు. వాటి సంగతి తేల్చిన తర్వాతే ప్రధాని రాష్ట్రంలో అడుగు పెట్టాలని కోరారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీకి సంబంధం లేనప్పుడు ఎందుకు కోర్టుకు వెళ్లిందని ప్రశ్నించారు. టీడీపీలో చంద్రబాబు కంటే తానే సీనియర్‌నని ఒక ప్రశ్నకు సమాధానంగా ఎర్రబెల్లి స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement