
సాక్షి, నూజివీడు: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే చంద్రబాబుకు నిరసన సెగ ఎదురైంది. టీడీపీ ఆఫీసులో చంద్రబాబును నూజివీడు టీడీపీ కార్యకర్తలు నిలదీశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
వివరాల ప్రకారం.. నూజివీడుకు చెందిన పార్టీ నేతలు కాపా శ్రీనివాసరావు వర్గం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా తమ గోడును చంద్రబాబును చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే, కాపా వర్గానికి చెందిన మండల తెలుగు యువత అధ్యక్షుడిని ఇటీవలే నూజివీడు జిల్లా అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని చంద్రబాబుకు తెలిపేందుకు కాపా వర్గం ప్రయత్నించింది. ఈ విషయమై చంద్రబాబును వారు నిలదీశారు. దీంతో, ఆగ్రహానికి లోనైన చంద్రబాబు.. కాపా వర్గంపై చిందులు తొక్కాడు. కాపా వర్గంపై బాబు మండిపడ్డారు.
ఇది పార్టీ ఆఫీసు అనుకుంటున్నారా? ఏమనుకుంటాన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోసారి ఇలా చేస్తే పార్టీ ఆఫీసు కాంపౌండ్‌లోకి కూడా రానివ్వనని బాబు హెచ్చరించారు. పది మంది ఇక్కడకు వచ్చి అరిస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. కాగా, చంద్రబాబు తీరుపై కాపా వర్గం అసహనం వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. కాపా వర్గం నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జ్ ముద్రబోయిన వర్గానికి వ్యతిరేకంగా ఉంది.
ఇది కూడా చదవండి: జగనన్న సురక్ష చరిత్ర సృష్టిస్తుంది: మంత్రి కాకాణి