దొరల గడీలో మరో గుమాస్తా ఎల్‌.రమణ

TDP Leader Ilaiah Slams To L Ramana For Joining In TRS - Sakshi

టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిలయ్య

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో ఎల్‌.రమణ చేరిక దొరల గడీలో మరో గుమాస్తా చేరినట్లుగా ఉందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీటీడీపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిలయ్య యాదవ్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా ఎక్కువగా నష్టపోయింది చేనేత కార్మికులేనని, వారిని ఆదుకోవాలని 10 రోజులు నిరాహార దీక్షలు చేసినా సీఎం కేసీఆర్‌ పట్టించుకోలేదని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన వాపోయారు. వస్త్రాలు కొనుగోలు చేయాలని ప్రాధేయపడినా పట్టించుకోలేదని, టీఆర్‌ఎస్‌ హయాంలో చేనేతలకు ఒనగూరింది శూన్యమని అయిలయ్య విమర్శించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top