అమరజీవికి అవమానం | TDP Leader Gond Shankar Controversial Comments On Potti Sriramulu | Sakshi
Sakshi News home page

అమరజీవికి అవమానం

Apr 29 2024 9:52 AM | Updated on Apr 29 2024 10:25 AM

TDP Leader Gond Shankar Controversial Comments On Potti Sriramulu

శ్రీకాకుళంలో టీడీపీ నేత గొండు శంకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు 

మున్సిపల్‌ మార్కెట్‌కు మరో పేరు పెడతామని ప్రతిపాదన 

మొన్నటికి మొన్న యాదవులను దూషించిన గొండు శంకర్‌ తండ్రి జగన్నాథం 

నేడు పొట్టి శ్రీరాములను అవమాన పరిచే విధంగా బహిరంగ ప్రకటన  

గొండు వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌ తండ్రి జగన్నాథం ఇటీవల యాదవులను నోటికొచ్చినట్లు తిట్టారు. వారిని కించపరిచేలా మాట్లాడటమే కాకుండా ఫోన్‌ సంభాషణలో బెదిరించారు.ఇప్పుడు గొండు శంకర్‌ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాతీపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములను అవమానపరిచేలా మాట్లాడారు. శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మున్సిపల్‌ మార్కెట్‌కు ఆ పేరు తీసేసి అంధవరపు తవిటయ్య పేరు పెడతామని, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడికి ప్రపోజల్‌ పెట్టామని బహిరంగ ప్రకటన చేశారు. తండ్రీకొడుకులిద్దరు చేసిన కామెంట్స్‌ ఇప్పుడు హా ట్‌ టాపిక్‌ అయ్యాయి.

ఇప్పటివరకు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులు నగర అభివృద్ధికి పాటు పడ్డారు. ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే జిల్లా కేంద్రం అభివృద్ధిలో కీలక భూ మిక వహించారు. రిమ్స్‌ ఆస్పత్రి, ప్రధాన వంతెనలు, రోడ్లు, కలెక్టరేట్, స్టేడియం, పార్కులు, మా ర్కెట్, శాలిహుండం, అరసవల్లి దేవాలయం అభివృద్ధి, శ్రీకూర్మం దేవాలయం అభివృద్ధి, కళింగపట్నం బీచ్‌ అభివృద్ధి, డంపింగ్‌ యార్డ్, తాగునీరు సరఫరా... ఇలా ఎన్నో అభివృద్ధి పనులతో శ్రీకాకుళం నగరంతో పాటు నియోజకవర్గ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు.

జిల్లాలోనైతే వంశధార ప్రాజెక్టు, ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు, లిఫ్ట్‌ ఇరిగేషన్, మడ్డువలస రి జర్వాయర్, అంబేడ్కర్‌ యూనివర్సిటీ, మూలపేట పోర్టు, ఉద్దానం కిడ్నీ ఆస్పపత్రి, ఉద్దానం మంచినీ టి ప్రాజెక్టు తదితర అభివృద్ధి పనుల్లో భాగస్వా మ్యం అయ్యారు. ఆయనే కాదు గుండ అప్పలసూర్యనారాయణ, గుండ లక్ష్మీదేవి, అంతకుముందు పనిచేసిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా శ్రీకాకుళం అభివృద్ధికి కృషి చేసి, చరిత్రలో నిలిచిపోయారు. కానీ ఎన్నడూ ఇలా ప్రముఖుల పేర్లు తీసేస్తామని వివాదాస్పదంగా వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న గొండు శంకర్‌ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.  

తండ్రి ఒక కులాన్ని దూషించగా, గొండు శంకర్‌ ఏకంగా వైశ్యుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టేలా, రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములను అవమానపరిచేలా వ్యాఖ్య లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంలో కీలక వ్యక్తుల పేరుతో కొత్తగా ఏవైనా ఏర్పాటు చేసి వాటికి పేరు పెట్టడమో, లేదంటే వారిని గౌరవించేందుకు, స్మరించేందుకు విగ్రహాలు ఏర్పాటు చేయడమో చేయాలి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అలాంటి గౌరవం ఎంతో మంది ప్రముఖులకు లభించింది. బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేశారు. అంధవరపు వరం మరణించాక ఆయన విగ్రహాన్ని ప్రధాన జంక్షన్‌లో ఏర్పాటు చేశారు. వీరితో పాటు మరికొంత ప్రముఖుల విగ్రహాలను నగరంలో ఆవిష్కరించారు. అంతేగానీ అప్పటికే ఉన్న వాటికి ప్రముఖుల పేర్లు తీసేయడం చేయలేదు.

 గొండు శంకర్‌ సమాజానికి ఏం సంకేతాలు ఇద్దామనుకుంటున్నారో గానీ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరుతో ఉన్న శ్రీకాకుళం మున్సిపల్‌ మార్కెట్‌కు ఆయన పేరు తీసేసి అంధవరపు తవిటయ్య పేరు పెడతామనడం వివాదాస్పదమైంది. ఆయన పేరు ను ఏదైనా కొత్తగా ఏర్పాటు చేసిన దానికి పెడతామ ని చెప్పాలే తప్ప రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాముల పేరును తీసేస్తామనడం, దానికో సం ఎంపీ రామ్మోహన్‌నాయుడికి ప్రతిపాదన పెట్టా మనడం వైశ్య వర్గాన్నే ఆశ్చర్యపరిచింది. వైశ్యుల ముద్దు బిడ్డగానే కాదు రాష్ట్రమంతా గొప్పగా భావించే పొట్టి శ్రీరాములు పేరు తీయాలన్న ఆలోచన రావడమే దారుణమని, ఇలాంటి వికృత చర్యలతో ఏం చేద్దామనుకుంటున్నారని వైశ్య వర్గాలే కాదు ప్రతి ఒక్కరూ తప్పు పడుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement