విజయవాడ: కోర్టు ఆవరణలో దారుణం.. పచ్చ గూండాల అరాచకం | TDP Cadre Attacks YSRCP Workers In Vijayawada Court Campus | Sakshi
Sakshi News home page

విజయవాడ: కోర్టు ఆవరణలో దారుణం.. పచ్చ గూండాల అరాచకం

Published Thu, Jun 13 2024 2:30 PM | Last Updated on Thu, Jun 13 2024 2:54 PM

TDP Cadre Attacks YSRCP Workers In Vijayawada Court Campus

సాక్షి, విజయవాడ: ఏపీలో టీడీపీ శ్రేణుల అరాచకాలు ఆగడం లేదు.. అధికార మత్తులో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. తాజాగా విజయవాడలోని కోర్టు ఆవరణలోనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పచ్చమూకలు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై గద్దె రామ్మోహన్‌ అనుచరులు దాడికి దిగారు.

కర్రలు, బీర్‌ బాటిళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆటోలో వెంబడించి టీడీపీ గూండాలు దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పవన్‌, రాజేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

ఎంతమంది తల్లులను క్షోభ పెడతారు..
వైఎస్సార్‌సీపీ కోసం పనిచేసినందుకే తమ పిల్లలపై దాడి జరిగిందని బాధితుల తల్లి మద్దెల మల్లిక అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటినుండి అరాచకం జరుగుతోంది. చంద్రబాబు, లోకేష్ ఈ దాడులకు సమాధానం చెప్పాలి. ఎంతమంది తల్లులను క్షోభ పెడతారు. ఎంతమంది మహిళల ఉసురు పోసుకుంటారు. నా బిడ్డల తలలు పగలగొట్టారు.. పరిస్థితి విషమంగా ఉంది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పైకి సౌమ్యంగా కనిపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతున్నారని.. దాడులను ప్రోత్సహించే వ్యక్తి అని, బీరు సీసాలు, కర్రలతో మాటు వేసి దాడి చేశారన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement