పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారు: బోండా ఉమ | Sakshi
Sakshi News home page

పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు

Published Fri, Jan 26 2024 8:08 PM

TDP Bonda Uma Comments On Pawan Kalyan Seat Sharing In AP - Sakshi

కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో టీడీపీలో వర్గవిభేదాలు, అంతర్గత వివాదాలు బయట పడుతున్నాయి. తెలుగుదేశం తమ్ముళ్లు బహిరంగానే కుమ్ములాటకు దిగుతున్నారు. తాజాగా కాకినాడు జిల్లా పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉప్పాడలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జయహో బీసీల సమావేశం జరిగింది.

ఈ క్రమంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ జనసేన నేతల ఆందోళన దిగారు. ఇలా ఎందుకు జరిగిందని మాజీ ఎమ్మెల్యే వర్మను జనసేన నాయకులు నిలదీశారు. దీంతో ఇది టీడీపీ కార్యక్రమం అంటూ వర్మ సమాధానం చెప్పాడు. వర్మ సమాధానంపై జనసేన కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని జనసేన నాయకులు తెగేసి చెప్పారు.

పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారు: బోండా ఉమ
టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలావరకు ఫైనల్ అయిందని టీడీపీ నేత బోండా ఉమ మహేశ్వర రావు అన్నారు. పవన్‌కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది, అవే ప్రకటించారని అన్నారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారని అన్నారు. పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారని బోండా  ఉమ ఎద్దేవా చేశారు.

చదవండి: మాకు చెప్పకుండానే రెండు సీట్లు ప్రకటించారు

 
Advertisement
 
Advertisement