‘ డిబేట్‌కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్‌ | Smriti Irani challenge Priyanka Gandhi To Debate Over Pick Any Channel Any Issue | Sakshi
Sakshi News home page

‘ డిబేట్‌కి ఎక్కడైనా రెడీ’.. ప్రియాంకా గాంధీకి స్మృతి ఇరానీ సవాల్‌

May 9 2024 12:22 PM | Updated on May 9 2024 1:28 PM

Smriti Irani challenge Priyanka Gandhi To Debate Over Pick Any Channel Any Issue

లక్నో: కేంద్రమంత్రి, బీజేపీ అమేథీ అభ్యర్థిని స్మృతి ఇరానీ.. కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రియాంక గాంధీకి సవాల్‌ విసిరారు. ఏ ఛానెల్‌ అయినా, హోస్ట్‌ ఎవరైనా, టైం, ప్రదేశం, అంశం ఏదైనా తాను డిబేట్‌లో మాట్లాడటానికి బీజేపీ సిద్ధంగా ఉందని స్మృతి ఇరాని ప్రియాంకా గాంధీకి ఛాలెంజ్ చేశారు.

‘‘నేను ప్రియాంకా గాంధీ, రాహుల్‌ గాంధీ ఇద్దరికీ ఛాలెంజ్‌ చేస్తున్నా. ఛానెల్‌, యాంకర్‌, ప్రదేశం, టైం విషయం ఏదైనా డిబేట్‌ చేయడానికి బీజేపీ సిద్ధం. ఒకవైపు.. సోదరుడు, సోదరీ. మరోవైపు.. బీజేపీ అధికార ప్రతినిధి ఉంటారు. మా పార్టీ నుంచి అయితే సుధాంశు త్రివేది చాలు. వాళ్లకు అన్ని సమాధానాలు చెబుతారు’’అని స్మృతి ఇరానీ బుధవారం అమేథీలో సవాల్‌ చేశారు.

దేశంలోని ముఖ్యమన  అంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెదవి విప్పరని ప్రియాంకా గాంధీ చేసిన ఆరోపణల నేపథ్యంలో స్మృతి ఇరానీ పైవిధంగా ఛాలెంజ్‌ విసిరారు.  

2019లో స్మృతి ఇరానీ.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని 55 వేల మేజార్టీతో ఓడించారు. మరోసారి బీజేపీ స్మృతి  ఇరానీకి అమేథీ టికెట్‌ కేటాయించింది. ఇప్పటికే స్మృతి ఇరానీ   అమేథీ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ మొత్తం తిరిగి ప్రచాం చేశారు. 

మరోవైపు.. కాంగ్రెస్‌కు కంచుకోట  స్థానమైన అమేథీలో నామినేషన్ల చివరి రోజు గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్‌ సింగ్‌ను బరిలోకి దిపింది. ఇక.. అమేథీ, రాయ్‌ బరేలీలో గెలుపే లక్ష్యంగా ప్రియాంకా గాంధీ శరవేంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement