నేను రాలేను.. డీకేను రిక్వెస్ట్‌ చేశా: సీఎం సిద్ధరామయ్య | Siddaramaiah Clarifies DK Shiva Kumar To Attend The Meeting | Sakshi
Sakshi News home page

నేను రాలేను.. డీకేను రిక్వెస్ట్‌ చేశా: సీఎం సిద్ధరామయ్య

Mar 13 2025 9:57 PM | Updated on Mar 13 2025 10:06 PM

Siddaramaiah Clarifies DK Shiva Kumar To Attend The Meeting

బెంగళూరు:  డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు రావాలంటూ పలు దక్షిణాది రాష్ట్రాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖలు రాసిన సంగతి తెలిసిందే.  ఈ నెల 22వ తేదీన డీలిమిటేషన్ అంశంపై చర్చకు రావాలంటూ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ,  ఒడిశా తదితర రాష్ట్రాలకు మెయిల్స్ ద్వారా లేఖలు పంపారు స్టాలిన్. అయితే  ఈ అంశంలో చర్చించడానికి తమ  రాష్ట్రం తరఫున డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వస్తారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ మేరకు తమిళనాడు సీఎం స్టాలిన్ కు లేఖ రాశారు.

‘ నేను కొన్ని వ్యక్తిగత పనులు వల్ల ఆ సమావేశానికి రాలేకపోతున్నాను. కానీ మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మా ప్రభుత్వం తరఫున డీకే శివకుమార్ వస్తారు. ఈ విషయంపై డీకే శివకుమార్ తో చర్చించిన తర్వాతే మీకు లేఖ రాస్తున్నా’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

కాగా,   డీలిమిటేషన్ అంశంపై మాట్లాడేందుకు కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం భగవత్ మాన్, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీలకు లేఖలు రాశారు స్టాలిన్‌.  ఇది సమాఖ్య వాదంపై స్పష్టమైన దాడిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర పరిపాలనను శిక్షించడమేనని స్టాలిన్ పేర్కొన్నారు. దీనిపై స్పష్టమైన విముఖత వ్యక్తం చేస్తున్న స్టాలిన్.. ఏడుగురు సీఎంలకు లేఖలు రాశారు.  దాంతో పాటు మాజీ సీఎంలకు ఆయన లేఖలు పంపినట్లు స్టాలిన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement