ఎన్నికల సిత్రాలు చూడరో: నిన్న ఏడుపులు.. నేడు చిందులు

Sagar Bypoll; BJP Candidate Ravi Naik Innovative Campaign - Sakshi

హోరాహోరీగా సాగర్ ఉప ఎన్నిక ప్రచారం

బీజేపీ అభ్యర్థి వినూత్న ప్రచారం

సాక్షి, నల్గొండ: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి రవినాయక్ వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మొన్న భావోద్వేగంతో కంటతడి పెట్టిన రవినాయక్.. ఇవాళ గ్రామాల్లో కోలాటం, బతుకమ్మ ఆడుతూ ఓట్లడుగుతున్నారు. గిరిజన బిడ్డను ఆశీర్వదించాలని రవినాయక్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

కాగా, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల నిర్వహణలో మరో అంకం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు శనివారంతో గడువు ముగిసింది. మొత్తం 19 మంది తమ నామినేషన్లు వెనక్కితీసుకోవడంతో 41 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ప్రధాన రాజకీయ పార్టీలు, ఇతర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, స్వతంత్రులు అంతా కలిపి 77 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గత నెల 31వ తేదీన జరిగిన నామినేషన్ల పరిశీలనలో 17 తిరస్కరణకు గురికాగా, శనివారం 19 మంది విత్‌డ్రా చేసుకున్నారు.

చదవండి:
లెక్కతేలిన సాగర్‌ అభ్యర్థులు
సాగర్‌కు ఈశాన్య దిక్కు..చివరి గ్రామం 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top