బహుజనవాదం .. బహుదూరం

RS Praveen Kumar: BSP will deposit in two seats - Sakshi

108 సీట్లలో పోటీ చేస్తే రెండు చోట్లనే బీఎస్‌పీకి డిపాజిట్‌

సిర్పూరులో బీజేపీ, బీఆర్‌ఎస్‌లను దాటలేక పోయిన ప్రవీణ్‌ కుమార్‌

పటాన్‌చెరులో డిపాజిట్‌ దక్కించుకొని మూడో స్థానానికే పరిమితం 

సాక్షి, హైదరాబాద్‌/ ఆసిఫాబాద్‌: బహుజన సమా­జ్‌ పార్టీకి మరోసారి చుక్కెదురైంది. బహుజన­వాదం నినాదంతో రాష్ట్రంలో కొన్ని సీట్లతో పాటు మెరుగైన ఓట్ల శాతం సాధించాలని కలలుగన్న బీఎస్‌పీ ఆశలు నీరుగారి పోయాయి. ఐపీఎస్‌ అధికారిగా స్వచ్చంద పదవీ విరమణ పొంది బీఎస్‌పీ సారథ్య బాధ్యతలు తీసుకొన్న ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ సారథ్యంలో 108 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్‌పీకి రెండు చోట్ల మాత్రమే డిపాజిట్‌ దక్కింది. అందులో ఒకటి ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేసిన సిర్పూరు కాగా, రెండోస్థానం పటాన్‌చెరు. సిర్పూరులో గెలుపుపై ఆశలు రేకెత్తించిన ప్రవీణ్‌కుమార్‌కు లభించిన ఓట్లు 44,646. ఇక్కడ అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబు విజయం సాధించగా, ప్రవీణ్‌ కుమార్‌ మూడో స్థానానికి పరిమితమయ్యారు.

దళిత, గిరిజన బహుజనుల ఓట్లపై గంపెడాశెలు పెట్టుకున్న ప్రవీణ్‌కుమార్‌ స్థానికేతరుడు కావడం కూడా ఇక్కడ ఆయన విజయావకాశాలను దెబ్బతీ­సినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కోనేరు కోనప్పను తెలంగాణేతరుడుగా ప్రచారం చేయడంలో ప్రవీణ్‌కు­మార్‌ విజయం సాధించినప్పటికీ, హరీశ్‌బాబు స్థానికుడు కావడంతో ఓట్లన్నీ గంపగుత్తగా పోలయినట్లు తెలుస్తోంది. కాగా పటాన్‌చెరులో చివరి నిమిషంలో బీఎస్‌పీ టికెట్టుపై పోటీ చేసిన కాంగ్రెస్‌ రెబల్‌ నీలం మధుకు 46,162 ఓట్లు మాత్రమే లభించి మూడోస్థానానికి పరిమితమ­య్యారు.

ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గూడెం మహిపాల్‌ రెడ్డి 7వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ రెండోస్థానంలో నిలిచారు. ఇక ప్రవీణ్‌కుమార్‌ సోదరుడు ప్రసన్న కుమార్‌ స్వచ్చంద విరమణ చేసి ఆలంపూర్‌ నుంచి పోటీ చేయగా, కేవలం 4,711 ఓట్లు మాత్రమే లభించాయి. వీరు కాకుండా పెద్దపల్లి నుంచి పోటీ చేసిన దాసరి ఉష 10,315 ఓట్లు సాధించగా, సూర్యా పేటలో వట్టి జానయ్యకు 13,907 ఓట్లు దక్కా యి. చొప్పదండి నుంచి పోటీ చేసిన శేఖర్‌కు 5,153 ఓట్లు లభించాయి. ఇలా మరికొన్ని స్థానాల్లో స్వ ల్పంగా ఓట్లు మాత్రమే సాధించి బహుజనవాదం వినిపించడంలో ఆ పార్టీ విఫలమైంది. 

ప్రవీణ్‌కుమార్‌కు నిరాశ
బహుజన వాదం నినా దంతో కుమురంభీంజిల్లా సిర్పూర్‌ నియోజక వర్గంలో పాగా వేయా లని ఆశపడిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమా ర్‌కు నిరాశ తప్పలేదు. దళితులు, గిరిజనులు, బుద్ధిస్టుల ఓట్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఆర్‌ఎస్పీ పోటీకి మొగ్గు చూపారు. పోలింగ్‌ సరళిని బట్టి ఆ పార్టీకి అధిక సంఖ్యలో ఓట్లు పడ్డాయని విశ్లేషకులు భావించారు. అయితే ఆ పార్టీ నాయకులు వేసిన అంచనాలు తారుమారయ్యాయి.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

04-12-2023
Dec 04, 2023, 08:21 IST
సాక్షి, యాదాద్రి: కోమటిరెడ్డి సోదరులు ఎమ్మెల్యేలుగా ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 1999 నుంచి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,...
04-12-2023
Dec 04, 2023, 08:11 IST
హసన్‌పర్తి : ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలుపు పొంది అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. గతంలో...
04-12-2023
Dec 04, 2023, 07:25 IST
పాలకుర్తి అసెంబ్లీ చరిత్రలో తొలిసారి 26 ఏళ్ల పిన్న వయస్కురాలిగా యశస్విని గెలుపొందారు.
04-12-2023
Dec 04, 2023, 06:04 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మిశ్రమ ఫలితాలిచ్చాయి. గతంతో పోలిస్తే సీట్లు, ఓట్లు పెరిగినా అధికారంలోకి...
04-12-2023
Dec 04, 2023, 05:51 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్లలో...
04-12-2023
Dec 04, 2023, 05:45 IST
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల ఫలితాలు బీజేపీ అగ్ర నాయకత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేశా యి. పార్టీకి పట్టున్న గ్రేటర్‌ హైదరాబాద్‌లో...
04-12-2023
Dec 04, 2023, 05:32 IST
సాక్షి, హైదరాబాద్‌/ కామారెడ్డి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పెను సంచలనం సృష్టించారు. కామారెడ్డి నుంచి సీఎం...
04-12-2023
Dec 04, 2023, 05:20 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. తాజాగా జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా పది మంది గెలుపొందారు....
04-12-2023
Dec 04, 2023, 05:00 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంకు ఘోర పరాభవం మిగిలింది. ఒంటరిగా పోటీచేసిన 19 స్థానాల్లోనూ దాదాపు అన్నిచోట్లా...
04-12-2023
Dec 04, 2023, 04:22 IST
సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా సోమవారం పార్టీ శాసనసభాపక్ష...
03-12-2023
Dec 03, 2023, 21:18 IST
సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ (సీఎల్పీ) సమావవేశంలో సోమవారం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని డీకే శివకుమార్‌ తెలిపారు. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ...
03-12-2023
Dec 03, 2023, 19:36 IST
హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ దాదాపు ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వ...
03-12-2023
Dec 03, 2023, 19:28 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. మొత్తంగా కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పైచేయి...
03-12-2023
Dec 03, 2023, 17:49 IST
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ను ఎలక్షన్‌ కమిషన్‌(ఈసీ) సస్పెండ్‌ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎన్నికల కోడ్‌ అమల్లో...
03-12-2023
Dec 03, 2023, 17:16 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ‍ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైనా ఎమ్మెల్సీ కవితకు  మాత్రం సంతోషం కలిగించే విషయం ఒకటుంది....
03-12-2023
Dec 03, 2023, 16:52 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ సీఎం పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. ఆదివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి...
03-12-2023
Dec 03, 2023, 15:20 IST
సాక్షి, హైదరాబాద్‌: కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే నన్ను మరోసారి అందలమెక్కిస్తాయి. నా విజయానికి తిరుగులేదు. నా గెలుపును...
03-12-2023
Dec 03, 2023, 14:14 IST
సాక్షి,హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి తొలిసారిగా పలువురు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గతంలో పోటీచేసి ఓడిపోయిన వాళ్లు, ఈ...
03-12-2023
Dec 03, 2023, 14:11 IST
పాలకుర్తి: ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందునుంచి ఊహించినట్లే...
03-12-2023
Dec 03, 2023, 09:49 IST
నల్గొండ: నాగార్జునసాగర్‌ నియోజకర్గంలోని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల కుమారులు కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు. వీరు కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డికి... 

Read also in:
Back to Top