పక్కా ప్లాన్‌.. ‘బాబు సీట్లో బాలకృష్ణ కూర్చున్న 48 గంటల్లోనే..’ | RK Roja Key Comments Over Chandrababu And Balakrishna | Sakshi
Sakshi News home page

బాబు సీట్లో బాలకృష్ణ కూర్చున్న 48 గంటల్లోనే.. మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

Sep 15 2023 10:18 AM | Updated on Sep 15 2023 5:04 PM

RK Roja Key Comments Over Chandrababu And Bala Krishna - Sakshi

సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మంత్రి రోజా సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ప్యాకేజీ కోసం జనసేన కార్యకర్తలను పవన్‌ తాకట్టు పెట్టాడని విమర్శించారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని పవన్‌.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. 

కాగా, మంత్రి రోజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్‌ కుంభకోణంలో పవన్‌ ప్యాకేజీ తీసుకున్నాడు. చంద్రబాబుది అక్రమ కేసు కాదు.. అడ్డంగా దొరికిపోయిన కేసు. చంద్రబాబు సీట్లో బాలకృష్ణ కూర్చున్న 48 గంటల్లోనే పవన్‌ కల్యాణ్‌ను రంగంలోకి దింపాడు. చంద్రబాబు తప్పు చేయకపోతే బాబు ఆస్తులపై సీబీఐకి డిమాండ్‌ చేయాలి. పవన్‌కు కనీస జ్ఞానం కూడా లేదు. 13 చోట్ల చంద్రబాబు సంతకాలు పెట్టి దొరికిపోయిన దొంగ. స్కిల్‌ కుంభకోణంలో ఐటీ, జీఎస్టీ, ఈడీలు విచారణలు జరిపాయి. 

బాలకృష్ణ.. తన తండ్రి మీద చెప్పులేసిన చంద్రబాబునే ఏమీ చేయలేకపోయాడు. ఇంక, సీఎం జగన్‌ను ఏం చేయగలడు. నిజంగా స్కిల్‌ కుంభకోణంలో చంద్రబాబుకు తప్పు చేయకపోతే సీబీఐ, ఈడీ విచారణ కోరాలి అని కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: ‘నోట్‌’ దిస్‌ పాయింట్‌

Advertisement
 
Advertisement
Advertisement