నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు | Removal Of Junior Ntr Flexi At NTR Ghat In Hyderabad, Sparks Row - Sakshi
Sakshi News home page

NTR Ghat-Jr NTR Banners: నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు.. జూ.ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తొలగింపు

Jan 18 2024 9:34 AM | Updated on Feb 2 2024 8:02 PM

Removal Of Junior Ntr Flexi At Ntr Ghat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీ చూసిన ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.. ఫ్లెక్సీని తీసేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో బాలకృష్ణ అభిమానులు.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించడంపై జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య గ్యాప్‌ మరింత పెరిగింది. గతంలో చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీయార్ సైతం మౌనంగా ఉండిపోవడంతో నందమూరి, నారా కుటుంబాలకు పెద్ద షాకే ఇచ్చింది. చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో తారక్‌ స్పందించకపోవడంతో ఆయనపై  బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్‌ కేర్‌ అంటూ ఫైర్‌ అయిన విషయం తెలిసిందే.

👉: తాత వర్థంతికి సిసలైన మనవడు ఎన్టీఆర్‌ నివాళి.. బాలయ్య సీరియస్‌ (ఫొటోలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement