కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమ హౌస్ అరెస్ట్ కొనసాగింపు | kethireddy pedda reddy house arrest | Sakshi
Sakshi News home page

కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమ హౌస్ అరెస్ట్ కొనసాగింపు

Oct 25 2026 8:54 PM | Updated on Oct 25 2026 8:54 PM

kethireddy pedda reddy house arrest

అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. స్వగ్రామం తిమ్మంపల్లిలో ఈ ఘటన జరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని గత మూడు రోజులుగా పోలీసులు హౌస్ అరెస్ట్‌లో ఉంచారు. ఇవాళ ఉదయం తాడిపత్రి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మంపల్లి గ్రామానికి వెళ్లారు. తిమ్మంపల్లి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. 

టీడీపీ నేతల ఒత్తిడితో తిమ్మంపల్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని పీఎస్‌లో నిర్బంధించారు. వివరాలు తెలుసుకునేందుకు తిమ్మంపల్లి వెళ్లారు. ఆ సమయంలోనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేతిరెడ్డి పెద్దారెడ్డిని తిమ్మంపల్లి నుంచి అనంతపురం తరలించారు. అనంతపురం నగరంలోని ఇంటి వద్ద కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు వదిలి వెళ్లారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్‌ను కొనసాగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement