కడప మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి, శ్యామల ప్రచారంలో దారుణం | TDP Goons Create Chaos During Kadapa Mayoral Candidate Bandi Deepthi, Shyamala Rally | Sakshi
Sakshi News home page

కడప మేయర్‌ అభ్యర్థి బండి దీప్తి, శ్యామల ప్రచారంలో దారుణం

Oct 25 2026 7:36 PM | Updated on Oct 25 2026 8:26 PM

TDP Goons Create Chaos During Kadapa Mayoral Candidate Bandi Deepthi, Shyamala Rally

సాక్షి,వైఎస్సార్‌ కడప : స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల, మేయర్ అభ్యర్థి బండి దీప్తి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో టీడీపీ గూండాలు అరాచకానికి పాల్పడ్డాయి. ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ కార్యకర్త కత్తితో దాడికి తెగబడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

వైఎస్సార్‌ జిల్లా పరిధిలోని 41వ డివిజన్‌లో ఆరే శ్యామల, మేయర్ అభ్యర్థి బండి దీప్తితో కలిసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రచార ర్యాలీలోకి టీడీపీ కార్యకర్త సయ్యద్‌ భాషా ఒక్కసారిగా కత్తితో దూసుకొచ్చాడు. ఈ హఠాత్ పరిణామానికి ప్రచారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయాందోళనకు గురయ్యారు. అడ్డొచ్చిన మాజీ కార్పొరేటర్ షంషీర్‌పై సయ్యద్‌ భాషా దాడి చేయడంతో ఆయన చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన షంషీర్ అనుచరుడు ఖాలీద్‌ హుస్సేన్‌పై కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన షంషీర్, ఖాలీద్ హుస్సేన్‌లను తక్షణమే చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, దాడికి పాల్పడిన నిందితుడు సయ్యద్‌ బాషాను అప్రమత్తమైన వైఎస్సార్‌సీపీ శ్రేణులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పాయి.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు షంషీర్, ఖాలీద్ హుస్సేన్‌లను వైఎస్సార్‌సీపీ నేతలు రవీంద్రనాథ్‌ రెడ్డి, అంజాద్‌ బాషా పరామర్శించి, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ ఆఘాయిత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై భౌతిక దాడికి దిగడం అరాచక రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి : ‘వచ్చే ఎన్నికల్లో చింతమనేని రాజకీయ జీవితం ముగిసినట్లే’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement