సిరి సహస్ర బీసీనా..! | YSRCP Complaint On Siri Sahasra Nomination | Sakshi
Sakshi News home page

సిరి సహస్ర బీసీనా..!

Oct 25 2026 7:41 AM | Updated on Oct 25 2026 7:49 AM

YSRCP Complaint On Siri Sahasra Nomination

విజయనగరం రూరల్‌: ఎస్‌.కోట నియోజకవర్గం కొత్తవలస మండలం, బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం నుంచి జెడ్పీటీసీ అభ్యర్థినిగా నామినేషన్‌ దాఖలు చేసిన మజ్జి సిరి సహస్ర ఎన్నికల పుణ్యామా అని తెరమీదకు వచ్చింది. వాస్తవంగా కొత్తవలస, తెర్లాం నియోజకవర్గాలు రెండు అన్‌ రిజర్వుడు కేటాయించినా, సిరి సహస్ర సమర్పించిన నామినేషన్‌ పత్రాల్లో బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జత చేయడమే చర్చకు దారితీసింది. 

వాస్తవంగా ఆమె జనన ధ్రువీకరణ పత్రంలో ముస్కాన్‌ జైన్‌గా నమోదు కావడంతో పాటు పదో తరగతి మార్కుల జాబితాలోనూ అదే పేరు నమోదై ఉంది. దీంతో జనన ధ్రువీకరణ పత్రంలో తండ్రి రమేష్‌ జైన్‌ పేరు ఆధారంగా ఆమె అగ్రకులానికి చెందిన వారవుతారు. అయితే జడ్పీటీసీ అభ్యర్థిగా రెండు నియోజకవర్గాలకు సమర్పించిన నామినేషన్‌ పత్రాల్లో బీసీ కుల ధ్రువీకరణ పత్రం జత చేశారు. నిబంధనల ప్రకారం జనరల్‌ కేటగిరీ కింద నామినేషన్‌ ఫీజు రూ.6 వేలు చెల్లించాల్సి ఉండగా బీసీ కేటగిరీలో డిపాజిట్‌ ఫీజు రూ.3 వేలు చెల్లించారు. ఇది ఆమె కులానికి సంబంధించి మరింత వివాదాన్ని రాజేసింది.  

ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌ సీపీ ఫిర్యాదు
ఈ అంశం వివాదస్పద కావడంతో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.కిరణ్‌కుమార్‌ను ప్రశ్నించారు. అగ్రకులాలకు చెందిన వ్యక్తిని ఫేక్‌ కుల ధ్రువీకరణ పత్రం ఆధారంగా నామినేషన్‌ పత్రాన్ని ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, పక్షపాతధోరణితో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. 

కొత్తవలస, తెర్లాం జడ్పీటీసీ స్థానాలకు ఓసీ వ్యక్తికి బీసీ సర్టిఫికెట్  ఇచ్చి టీడీపీ నామినేషన్‌ వేయించిందని ఆరోపించారు. బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్‌ హక్కులను అక్రమ మార్గంలో ఆమెకు కట్టబెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తహసీల్దార్‌ బీసీ సర్టిఫికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఎన్నికల అధికారులు నామినేషన్‌ను ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. ఆమె నామినేషన్‌ తిరస్కరించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. 

ఇదీ చదవండి: సైలెంట్‌గా రెండుచోట్ల సిరిసహస్ర నామినేషన్‌

ముస్కాన్‌ జైన్‌ పేరును సిరి సహస్రగా మారుస్తూ జారీ చేసిన గజిట్‌ నోటిఫికేషన్‌ 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement