పవన్ మాటల వెనుక ఆంతర్యం ఏమిటో?

Pawan Kalyan Controversial Comments On YSRCP - Sakshi

సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తనకు నచ్చిన విధంగా ఏదో ఒక రకంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. ఆధారాలు లేకుండా కామెంట్స్‌ చేస్తున్నారు. టీడీపీ, జనసేనపై ప్రజల్లో సానుభూతిని సంపాదించుకునేందుకు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. 

1) పెడన సభలో నాపై దాడికి 2 వేల మంది క్రిమినల్స్‌ను రాళ్ల దాడి కి దింపారనే సమాచారం ఉంది: (2023-10-03) 

2) హైదరాబాద్‌ ఇంటి దగ్గర నాపై దాడికి కుట్ర పన్ని ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించారు: (నవంబర్ 4, 2022)  

3) కోనసీమ జిల్లాల్లో వారాహి యాత్రపై దాడి చేసేందుకు 2 వేల మంది నేరగాళ్లను దించారు, 50 మందిని చంపేయాలని ప్లాన్ వేశారు, నాకు కేంద్ర ఇంటెలిజెన్స్‌ నుంచి ఈ సమాచారం వచ్చింది: (10-09-2023)

4) చింతమనేని నన్ను చంపటానికి ప్లాన్ చేసారు, అది వీడియో తీసి కొందరు నాకు పంపించారు, నేను భయపడును, చిన్నప్పుడే రౌడీలను కొట్టాను: (సెప్టెంబర్ 28, 2018 )

5) వైఎస్ రాజశేఖర రెడ్డి నాపై దాడి చేయమని 2వేల మందిని పంపాడు నేను భయపడలేదు 2009లో కామెంట్స్‌.

ఇలా ఏదో విధంగా పవన్‌ కల్యాణ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు పవన్‌ చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటీ రుజువు కాలేదు. దీనికి సంబంధించిన వివరాలను కూడా పవన్‌ ఎక్కడా చూపించలేదు. ఇక, హైదరాబాద్‌లో దాడికి ప్లాన్‌ చేశారని ఊదరగొట్టినా తెలంగాణ పోలీసులు.. అక్కడ ఏం జరిగిందో క్లియర్‌గా చెప్పేశారు. అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో, ఎల్లో బ్యాచ్‌ సహా పవన్‌కు షాక్‌ తగిలినట్టు అయ్యింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top