బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా | Sakshi
Sakshi News home page

బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా

Published Sun, Jan 28 2024 7:29 AM

Nitish Kumar To Resign Today Updates - Sakshi

 అప్‌డేట్స్..

► బీహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి నితీష్ కుమార్ సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇద్దరు బీజేపీ పార్టీకి చెందిన నేతలు విజయ్‌ సిన్హా, సామ్రాట్‌ చౌదరీ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేస్తారు. వీరితో పాటు ఓబీసీ-ఈబీసీ  సమీకరణాల్లో భాగంగా మరో 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బిహార్‌ రాజకీయాలపై  ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌​ ఒవైసీ ఫైర్‌
జేడీ(యూ) చీఫ్‌ నితీష్‌ కుమార్‌,  ఆర్జేడీ నేత  తేజస్వీ యాదవ్‌, ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.  వీరు  ముగ్గురు బిహార్‌ ప్రజలకు ద్రోహం చేశారు.  మరీ ముఖ్యంగా నితీష్‌ కుమార్‌ అయితే పలు సార్లు బిహార్‌ ప్రజలను మోసం చేశారు. రాజకీయ ఆవకాశవాదంలో నితీష్‌ రికార్డులు బద్దలు కొట్టారు.

బీజేపీతో నితీష్ కుమార్ చేతులు కలిపి ఎన్డీఏ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు వేడుక చేసుకుంటున్నాయి. కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. 

సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం బిహార్ సీఎం నితీష్‌ కుమార్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఎన్డీఏ కూటమిలో చేరనున్నందుకు అభినందనలు తెలిపారు.  

బిహార్‌లో రాష్ట్ర శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సామ‍్రాట్ చౌధరి మాట్లాడారు. తన జీవిత కాలంలో సాధించిన అరుదైన సందర్భంగా అభివర్ణించారు. 

బీజేపీ, జేడీయూలతో కలిపి బిహార్‌లో ఎన్జీడే ప్రభుత్వం ఏర్పడటానికి రాష్ట్ర ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 

నితీష్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఇది జరుగుతుందని తనకు ముందే తెలుసని అన్నారు.

మహాకూటమిలో పరిస్థితిలు సరిగా లేవని నితీష్ కుమార్ చెప్పారు. అందుకే మహాకూటమి నుంచి బయటకు వచ్చానని అన్నారు. త్వరలో కొత్త కూటమిని ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. గవర్నర్‌కు లేఖ సమర్పించానని స్పష్టం చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించిన అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

బీహార్‌, పాట్నాలో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం ముగిసింది.

బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్చించారు. దీంతో జేడీయూ - ఆర్జేడీ ప్రభుత్వం కూలిపోయింది.
 ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బీజేపీ-జేడీయూ నేతృత్వంలో సీఎంగా నితీష్ మళ్లీ ప్రమాణం చేయనున్నారు. 

బిహార్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీల పెద్దలు తమ వర్గం ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలతో పార్టీ పెద్దలు సమావేశం ప్రారంభించారు.   

 పార్టీ ఎమ్మెల్యేలతో నేడు పాట్నాలో జరగనున్న సమావేశానికి బిహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌధరి హాజరయ్యారు.    

పాట్నాలోని పార్టీ కార్యాలయానికి బిహార్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ హాజరయ్యారు.  

సీఎం నితీష్ కుమార్ ఇంటికి జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్ వచ్చారు. కేవలం తమను రమ్మని మాత్రమే పిలిచినట్లు ఆయన చెప్పారు. తదుపరి పరిణామాలు తెలియదని అన్నారు. 

బిహార్‌లో రాజకీయ మార్పులు రసవత్తరంగా ఉన్నాయి. పాట్నాలో పార్టీ కార్యాలయానికి కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ నిత్యానంద రాయ్ బయలుదేరారు. 

 పాట్నాలోని పార‍్టీ కార్యాలయానికి బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ బయలుదేరారు.  

పార్టీ శాసనసభ్యుల భేటీకి హాజరవుతున్నట్లు బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, బీజేపీ ఎమ్మెల్యే తార్‌కిషోర్ ప్రసాద్ తెలిపారు. అజెండా పూర్తిగా తనకు తెలియదని చెప్పారు. రావాలని చెప్పారు.. కాబట్టి తాము వస్తున్నట్లు చెప్పారు.

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేడు రాజీనామా చేయనున్నారు. గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎంగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్‌ సంకీర్ణ సర్కారుకు జేడీ(యూ) సారథి, సీఎం నితీశ్‌కుమార్‌ గుడ్‌బై చెప్పడం, మళ్లీ బీజేపీతో దోస్తీ కట్టి ఎన్డీఏ కూటమిలో చేరడం ఖాయమైనట్టు కనిపిస్తోంది. 

బీజేపీ, జేడీ(యూ), జితిన్‌రాం మాంఝీ సారథ్యంలోని హిందూస్తాన్‌ అవామీ లీగ్‌ అందులో పాల్గొంటాయి. ఎమ్మెల్యేలంతా కలిసి శాసనసభాపక్ష నేతగా నితీశ్‌ను ఎన్నుకుంటారు. వెంటనే ఆయన గవర్నర్‌ను కలిసి సీఎం పదవికి రాజీనామా చేస్తారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖలు సమరి్పంచి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరతారు. సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. బీజేపీ నేత సుశీల్‌కుమార్‌ మోదీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని సమాచారం.

మాంఝీ కూడా రెండు మంత్రి పదవులు డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదివారం విధులకు రావాల్సిందిగా సచివాలయ సిబ్బందికి ఆదేశాలు వెళ్లడం వంటివన్నీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సూచికలేనని చెబుతున్నారు. పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా నితీశ్‌ను బలపరిచే అవకాశముందని వార్తలొస్తున్నాయి. కనీసం ఏడెనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సెల్‌ ఫోన్లు శనివారమంతా స్విచాఫ్‌ కావడం వాటిని బలపరుస్తోంది!

ఇండియా కూటమి ఖతమే: జేడీ(యూ)
బిహార్లో ఘట్‌బంధన్‌ సంకీర్ణం కుప్పకూలనుందని జేడీ(యూ) రాజకీయ సలహాదారు, అధికార ప్రతినిధి కేసీ త్యాగి స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులు నితీశ్‌ను పదేపదే అవమానించడమే ఇందుకు కారణమని చెప్పారు. కాంగ్రెస్‌ సారథ్యంలోని విపక్ష ఇండియా కూటమి కూడా కుప్పకూలే దశలో ఉందని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మాత్రం కూటమికి వచి్చన ముప్పేమీ లేదని ఆశాభావం వెలిబుచ్చారు. అయితే, నితీశ్‌తో మాట్లాడేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పదేపదే ప్రయత్నించినా ఆయన ‘బిజీ’గా ఉండటంతో వీలు కాలేదని వెల్లడించారు! ఇండియా కూటమి నుంచి జేడీ(యూ) వైదొలగుతున్నట్టు ఎలాంటి సమాచారమూ లేదని ఖర్గే చెప్పుకొచ్చారు. 

ఇదీ చదవండి: కూటమిని కాపాడుకుంటాం: ఖర్గే

Advertisement
 
Advertisement