సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి పితాని బాలకృష్ణ | Mummidivaram Janasena Incharge Pithani Balakrishna Joins Ysrcp | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి పితాని బాలకృష్ణ

Published Sat, Mar 30 2024 8:20 PM | Last Updated on Sat, Mar 30 2024 8:58 PM

Mummidivaram Janasena Incharge Pithani Balakrishna Joins Ysrcp - Sakshi

సాక్షి, కోనసీమ జిల్లా: ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేనలకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నాయకులంతా వరుసగా గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి భారీగా వైఎస్సార్సీపీలో చేరారు.

మేమంతా సిద్ధం బస్సుయాత్రలో తుగ్గలి వద్ద... సీఎం వైఎస్‌ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముమ్మిడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్ సానబోయిన మల్లిఖార్జున్‌ సహా పలువురు జనసేన పార్టీ కీలక నేతలు చేరారు.

జనసేన పార్టీలో కష్టపడినవారికి కాకుండా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్, పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ కలసి టికెట్లు అమ్ముకున్నారని పితాని బాలకృష్ణ మండిపడ్డారు. పార్టీ కోసం కోట్లాదిరూపాయల ఆస్తిని అమ్ముకున్న తనకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: టీడీపీ, జనసేనకు వరుస షాక్‌లు! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement