అన్నామలై రాజీనామాపై రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు | MLA Raja Singh reacted To Tamil Nadu Annamalais Resignation | Sakshi
Sakshi News home page

అన్నామలై రాజీనామాపై రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు

Jun 5 2026 4:05 PM | Updated on Jun 5 2026 4:22 PM

MLA Raja Singh reacted To Tamil Nadu Annamalais Resignation

హైదరాబాద్‌: తమిళనాడు బీజేపీలో కీలక నేతగా ఎదిగి, ఆ పార్టీతో తన ప్రస్థానాన్ని ముగించుకున్న అన్నామలై వ్యవహారంపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సింగ్‌ స్పందించారు. ప్రధానంగా అన్నామలై రాజీనామా ఆమోదంపై రాజాసింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో బీజేపీకి గుర్తింపు తెచ్చిన అన్నామలై పార్టీని వీడటం దురదృష్టకరమన్నారు. 

‘ అన్నామలై ఆరేళ్ల కింద ఐపీఎస్‌కి రాజీమానా చేసి బీజేపీలో చేరారు. ఆయన తమిళనాడు లో బీజేపీకి గుర్తింపు తెచ్చాడు. అన్నామలై పార్టీని వీడడం దురదృష్టకరం. ఇలాంటి నేతలు పార్టీ వీడడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా రాజీనామా ఇస్తే.. దానికి కారణం తెలుసుకోవాలి... వారిని పిలిచి మాట్లాడాలి. 

నాకు జరిగిందో అన్నామలై విషయంలో కూడా జరిగింది. తెలంగాణలో జరిగిన  విషయాలనే కేంద్ర పెద్దలకు చెప్పాను. పెద్ద నాయకులను కలవడానికి ప్రయత్నం చేశా.. ఎవ్వరు కలవలేదు.. చివరకి పార్టీకి రాజీనామా ఇచ్చాను. కనీసం ఎందుకు రాజీనామా ఇచ్చావో అడగకుండా రాజీనామాను ఆమోదించారు. నేను బయటకి వచ్చి ఏడాది అయింది.. ఏ పార్టీ లోకి వెళ్ళలేదు.. వెళ్ళను కూడా. నాలాంటి, అన్నామలై లాంటి వాళ్ళను కాపాడాల్సిన బాధ్యత పార్టీ పై ఉంది. ఇలాంటి వాళ్ళు బాధ పడితే.. రాష్ట్ర, కేంద్ర నాయకులు పిలిచి మాట్లాడాలి’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:
బీజేపీపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement