‘నేను కోవర్ట్‌ అయితే.. రేవంత్‌ కూడా కోవర్టే’ | MLA Jagga Reddy Slams On Social Media Propaganda Over KTR Covert | Sakshi
Sakshi News home page

‘నేను కోవర్ట్‌ అయితే.. రేవంత్‌ కూడా కోవర్టే’

Jan 2 2022 6:21 PM | Updated on Jan 2 2022 7:25 PM

MLA Jagga Reddy Slams On Social Media Propaganda Over KTR Covert - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌కు కొవర్ట్‌ అంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కొద్దిరోజుల క్రితం తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారని తెలిపారు. ఆ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ను నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని కోరినట్లు పేర్కొన్నారు. తన నియోజకవర్గ అధికార కార్యక్రమానికి వచ్చిన మంత్రితో తాను మాట్లాడిన అంశాన్ని కొందరు పనిగట్టుకొని నెగిటివ్ చేస్తున్నారని మండిపడ్డారు. 

నియోజకవర్గ అధికార కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారైనా సక్యతతో మెలగాల్సిందేని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ మంత్రులను నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు అడగకూడదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో చిల్లర బ్యాచ్ ఒకటి తయారైందని, టీఆర్ఎస్ పార్టీలోకి పోవాలంటే నేరుగా వెళ్తానని తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. పీసీసీలో నచ్చని అంశాలను సరిచేసుకోవాలని చెప్పడం తప్పా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్‌ను చాలా విషయాల్లో వ్యతిరేకించినా.. పార్టీ మారుతున్నానని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కోవర్ట్‌ అయితే.. రేవంత్‌ కూడా కోవర్టే అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement