పేదల ఇళ్లపై చంద్రబాబు నీచ రాజకీయాలు: వెల్లంపల్లి | Minister Vellampalli Srinivas Firs On Chandrababu | Sakshi
Sakshi News home page

పేదల ఇళ్లపై చంద్రబాబు నీచ రాజకీయాలు: వెల్లంపల్లి

Jul 1 2021 2:59 PM | Updated on Jul 1 2021 7:12 PM

Minister Vellampalli Srinivas Firs On Chandrababu - Sakshi

 రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 31 లక్షల మంది పేదలకు ఇళ్లు కేటాయించారని పేర్కొన్నారు.

సాక్షి, అమరావతి: రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 31 లక్షల మంది పేదలకు ఇళ్లు కేటాయించారని పేర్కొన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రకరించారన్నారు. రాజధాని పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. పేదలకు ఉచితంగా ఇచ్చే ఇళ్లపై చంద్రబాబు, దేవినేని ఉమా నీచ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి నిప్పులు చెరిగారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement