‘టీడీపీ, బీజేపీ మధ్య చీకటి తెరలు తొలగిపోయాయి’ | Minister Kurasala Kannababu Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘టీడీపీ, బీజేపీ మధ్య చీకటి తెరలు తొలగిపోయాయి’

Feb 15 2022 12:05 PM | Updated on Feb 15 2022 12:44 PM

Minister Kurasala Kannababu Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రత్యేక హోదా అంశానికి తీవ్ర ద్రోహం చేసింది చంద్రబాబేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా అంటూ ప్రశ్నించారు.

చదవండి: AP: వైద్య, ఆరోగ్య శాఖలో మరో 2,588 పోస్టులు

‘‘నాడు ప్యాకేజీకి ఒప్పుకుని పండగ చేసుకుంది చంద్రబాబు కాదా?. హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే టీడీపీ ఎందుకు చేయలేదు?. ఇప్పుడు హోదా గురించి మాట్లాడేందుకు చంద్రబాబుకు సిగ్గుందా?. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే. లో​కేష్‌ ఏ బ్రాండ్‌ తాగుతున్నాడో అర్థం కావడం లేదు. ట్విట్టర్‌ ఉంది కదా అని ఏదంటే అది మాట్లాడుతున్నాడు. హోదా అంశాన్ని జీవీఎల్‌ తొలగించేలా చేయడం అశ్చర్యానికి గురి చేసింది. చంద్రబాబు కలిసి జీవీఎల్‌ చేశారా?. హోదా అంశం తొలగింపుతో టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న చీకటి తెరలు తొలగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పట్ల జీవీఎల్‌కు ఉన్న బాధ్యత ఏంటని’’ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement