‘నీ తండ్రి, తాతల చరిత్ర ఏంటో తెలుసుకో లోకేష్‌’

Minister Kakani Govardhan Reddy fires On Chandrababu Lokesh At Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌లపై  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కాకాణి గోవర్థనరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్‌ తలపై రుపాయి పెడితే పావలాకు పనికిరాడని విమర్శించారు. తన తండ్రి, తాతల చరిత్ర ఏంటో లోకేష్‌ తెలుసుకోవాలని హితవు పలికారు. బాబు తండ్రి ఖర్జూరనాయుడు రైతుల పొలాల్లో రాత్రిళ్లు వేరుశెనగ బస్తాలు ఎత్తెకెళ్లేవాడని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు జేబులు కొట్టేవాడని అందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు అఖిల భారత దరిద్ర సంఘానికి అధ్యక్ష, కార్యదర్శులుగా తయారయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చంద్రబాబు జన్మించడమే పెద్ద శాపమని ధ్వజమెత్తారు.

మంత్రి ఇంకా మాట్లాడుతూ..‘అసలు లోకేష్ అనేవాడు ఎవరు, ఎక్కడ గెలిచాడు, ఏ ప్రజా ఉద్యమాల నుంచి వచ్చాడు. వార్డు మెంబరుగా కూడా గెలవనటువంటి వాడు నెల్లూరు వచ్చి, ముఖ్యమంత్రిని, మంత్రిని, స్థానిక ఎమ్మెల్యేలపై నోటికొచ్చినట్లు మాట్లాడతాడా.? ఇప్పటికైనా లోకేష్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకోవాలి.. ఫేక్ వ్యక్తులు ఎవరో రాష్ట్ర ప్రజలకు, సమాజానికి బాగా తెలుసు. చంద్రబాబు కుటుంబానికి ఉన్న క్రెడిబులిటీ ఏమిటో, క్యారెక్టర్ ఏమిటో అందరికీ తెలుసు. అటువంటి వీళ్ళు సీఎం జగన్‌ కుటుంబం గురించి మాట్లాడటానికి అర్హత ఎక్కడిది.  మీ మాదిరిగా మేమూ మాట్లాడితే.. మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు’ అని సూటిగా ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top