పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ కౌంటర్

సాక్షి, విజయవాడ: చంద్రబాబు, పవన్ పొత్తు వలన తమకొచ్చే ఇబ్బంది ఏమీ లేదని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. ‘‘పవన్ కల్యాణ్ రాజకీయ వ్యభిచారి. బీజేపీ పంచన ఉంటూ చంద్రబాబుకు సిగ్నల్ ఇచ్చేవాడిని ఇంకేం అంటారు?. పవన్ అన్నట్టుగానే రాష్ట్రంలో అద్భుతం జరగబోతోంది. ఆ అద్భుతం వైఎస్సార్‌సీపీ 151పైగా సీట్లలో గెలవటమే. అంతే తప్ప పవన్ ఊహించుకునేదేమీ జరగదు.
చదవండి: ఎంతటికైనా దిగజారతాడు.. బాబు వీక్‌నెస్ అదే..
చంద్రబాబు, పవన్ ఇవాళ కలిసేదేముందీ?. మొదటనుంచి వారి మధ్య అక్రమ పొత్తులు కొనసాగుతున్నాయి. వారి పొత్తుల వలన మాకు వచ్చే ఇబ్బందిఏమీ ఉండదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎవరి వలన అందుతున్నాయో ప్రజలకు బాగా తెలుసు. అందుకే ఎన్నికల్లో చంద్రబాబు కూటమికి తగిన బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే చేస్తాననే చంద్రబాబుకు ప్రజలు మళ్లి తగిన బుద్ది చెప్తారని మంత్రి జోగి రమేష్ అన్నారు.
సంబంధిత వార్తలు