మోదీ, అమిత్‌షాకు మంత్రి జగదీష్‌రెడ్డి చాలెంజ్‌

Minister Jagadish Reddy Challenge To Modi And Amit Shah - Sakshi

సాక్షి, నల్గొండ: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేడి పెరుగుతోంది. పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నేతల మధ్య పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. మునుగోడు మండలం‌ కొరటికల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జగదీష్‌రెడ్డి.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు చాలెంజ్‌ విసిరారు. ‘‘రూ.18 వేల కోట్లు మునుగోడు, నల్లగొండ అభివృద్ధికి ఇవ్వండి.. ఉప ఎన్నికల నుంచి తప్పుకుంటాం’’ అని మంత్రి అన్నారు. ఒక వ్యక్తి కోసం రూ.18 వేల కోట్లు ఇవ్వడమేంటి?. పార్టీ మారినందుకే రాజగోపాల్‌రెడ్డికి రూ.18వేల కోట్లు ఇచ్చారని జగదీష్‌రెడ్డి దుయ్యబట్టారు.
చదవండి: చిక్కుల్లో మంత్రి మల్లారెడ్డి.. బయటపడిన వీడియో.. ఆయన స్పందన ఇదే..

మరో వైపు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మునుగోడు ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారంటూ మండిపడ్డారు. తనపై కావాలనే అపనిందలు వేస్తున్నారు. తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేకపోతే ఆరోపణలు చేసేవారు రాజీనామా చేయాలి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీసం అపాయిమెంట్‌ ఇవ్వకుండా అవమానించారంటూ రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top