చిక్కుల్లో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. బయటపడిన వీడియో.. ఆయన స్పందన ఇదే..

Minister Malla Reddy Liquor Party Video Viral - Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. బహిరంగంగా మద్యం తాగుతూ కెమెరాలకు చిక్కారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన మల్లారెడ్డి ప్రచారం తర్వాత తన అనుచరులతో కలిసి మందు తాగుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఫుల్‌  బాటిల్‌ పట్టుకుని గ్లాస్‌లో మందు పోస్తున్న మల్లారెడ్డి విజివల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. చౌటప్పల్‌ మండలంలో ఆరెగూడెం గ్రామానికి ఎన్నికల ఇంఛార్జ్‌గా మల్లారెడ్డి ఉన్నారు. ఆదివారం గ్రామానికి వెళ్లిన ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి రోజంతా ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం తన అనుచరులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: అందుకు మీరు సిద్ధమా?.. రాజగోపాల్‌రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌

దీనిపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ.. కావాలనే మందు బాటిల్ చేతిలో ఉన్న ఫోటో వైరల్ చేస్తున్నారన్నారు. మా కుటుంబ సభ్యులకు ఇస్తున్న బాటిల్ మాత్రమే. నేను తాగలేదంటూ వివరణ ఇచ్చారు.  మునుగోడు ఎన్నికల్లో తాను కొన్ని గ్రామాలకు ఇంఛార్జ్‌గా ఉన్నానన్నారు. ప్రచారం తర్వాత అక్కడే ఉన్న మా బంధువులు ఇంటికి వెళ్లాను. నా కన్నా పెద్దవాళ్లు ఉన్నారు. మందు సర్వ్ చేశాను. తెలంగాణ సంప్రదాయం ఇది.. తప్పేముంది. నా చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మా బంధువులు. అది రహస్యంగా చేసిన పని కాదు.. ఊర్లో బంధువుల ఇల్లు అది. అది నా పర్సనల్ పని.. భోజనం చేయడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని మంత్రి అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top