ప్రభుత్వానికి ఏం సంబంధం?: బొత్స | Minister Botsa Satyanarayana Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

13 జిల్లాల అభివృద్ధే సీఎం జగన్‌ లక్ష్యం: బొత్స

Oct 11 2020 12:46 PM | Updated on Oct 11 2020 3:15 PM

Minister Botsa Satyanarayana Comments On Chandrababu - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో 13 జిల్లాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల ప్రతిపాదనను అన్ని జిల్లాల ప్రజలు హర్షిస్తున్నారని.. చంద్రబాబు, అతని పెయిడ్ అర్టిస్టులు మాత్రమే మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. వికేంద్రీకరణను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, బినామీ ఆస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబు అమరావతి అంటున్నారని దుయ్యబట్టారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద కథ నడుస్తోంది..

ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధాని చిత్రాలు ప్రజలకు చూపించారని ఎద్దేవా చేశారు. విశాఖ భూ కుంభకోణంపై త్వరలోనే సిట్‌ దర్యాప్తు పూర్తవుతుందని, దేనిపైనైనా విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. మాన్సాస్‌ వ్యవహారం కుటుంబ తగదా.. ప్రభుత్వానికి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని తెలిపారు. అబద్ధాలు చెప్పడానికి అశోక్‌ గజపతిరాజు వ్యక్తిత్వం ఏమైందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధమవుతుందని, త్వరలో ఆఫీస్ కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. (చదవండి: విశాఖలో లారీ బీభత్సం..)

సుప్రీంకోర్టు, హైకోర్టులపై తమకు గౌరవం, రాజ్యాంగంపై విశ్వాసం ఉందని మంత్రి బొత్స తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రూపంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అన్ని అంశాలు వివరించారు. దేశంలో రాజ్యాంగంపై గౌరవం ఉన్న వ్యక్తులు  స్పందించాలి.  తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రభుత్వ సలహాదారులు అజేయ్ కల్లం ఇప్పటికే వివరించారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement