సుప్రీంకోర్టు సీజేకు సీఎం లేఖపై ప్రముఖుల స్పందన

Celebrities React On Twitter Over CM Jagan Mohan Reddy Complains To CJI - Sakshi

సుప్రీంకోర్టు సీజేకు సీఎం లేఖపై ప్రముఖుల స్పందన

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పనితీరుపై, దానిని ప్రభావితం చేస్తున్న సుప్రీంకోర్డు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డేకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. దీనిపై పలువురు ప్రముఖులు ట్విటర్‌ ద్వారా ఇలా స్పందించారు. (ఏపీ హైకోర్టుకు ‘సుప్రీం’ కమాండ్‌)

సీఎం వర్సెస్‌ సుప్రీంకోర్టు జడ్జి
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జిలను ప్రభావితం చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బాబ్డేకు లేఖ రాశారు. - బార్‌ అండ్‌ బెంచ్‌

ఇప్పుడు స్పష్టం..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యవహారాలు బహిర్గతం చేసినప్పటి నుంచి ఆయన సన్నిహితుడైన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణ.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి ద్వారా న్యాయ వ్యవస్థను ప్రభావితం చేశారని ఇప్పుడు స్పష్టమైందని జగన్‌ ప్రధాన సలహాదారు అజేయ కల్లం ఆరోపించారు. - పాయల్‌ మెహతా

ఏపీలో పెద్ద కథ..
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద కథ నడుస్తోంది. సుప్రీంకోర్టు తదుపరి చీఫ్‌ జస్టిస్‌ కుటుంబ అవినీతిపై ఒక సీఎం నేరుగా ఆరోపించారు. ఈ కథను నివేదించకుండా హైకోర్టు ఒక వింత గాగ్‌ ఆర్డర్‌ ఇచ్చింది. ప్రస్తుతం సీఎం వైఎస్‌ జగన్‌ దీనిని ప్రజలు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. - రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌

ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర : హిందుస్తాన్‌ టైమ్స్‌
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు, కూల్చి వేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, రాష్ట్ర హైకోర్టు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ఆరోపించిందని హిందుస్తాన్‌ టైమ్స్‌ పేర్కొంది. ఈ మేరకు ఆ పత్రిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో ఓ కథనం ప్రచురించింది. అందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.  (అచ్చు గుద్దినట్లు ఇద్దరిదీ ఒకే మాట)

  • జస్టిస్ రమణపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఐ బొబ్డేకు లేఖ రాశారు. ఎన్వీ రమణ గతంలో టీడీపీ ప్రభుత్వానికి న్యాయ సలహాదారు, అదనపు అడ్వకేట్ జనరల్ అని ఆ లేఖలో వివరించారు. 
  • రాష్ట్ర న్యాయ వ్యవస్థ టీడీపీ పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తూ.. ఆ పార్టీ ప్రయోజనాల కోసం అవినీతి వ్యవహారాలపై తొలి దశలోనే దర్యాప్తులు జరగకుండా స్టే ఇస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో స్వార్థ ప్రయోజనాలను పరిరక్షించడం కోసం మూడు రాజధానుల బిల్లులను అడ్డుకోవడం సహా తన ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు వరుస తీర్పులు ఇచ్చిందని సీఎం జగన్ పేర్కొన్నారు.
  • వివిధ దశల్లో దాదాపు 30 ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో (పిల్‌) ముఖ్యమంత్రిని ప్రతివాదిగా పేర్కొన్నారని వివరించారు. గత టీడీపీ ప్రభుత్వ అవినీతిపై తమ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించిన వెంటనే, జస్టిస్ రమణ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి ద్వారా రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థపై ప్రభావం చూపడం ప్రారంభించారని ఆరోపించారు. 
  • జస్టిస్ ఎవి శేషసాయి, జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ డి రమేష్‌, జస్టిస్‌ కె.లలిత, మరికొంత న్యాయమూర్తులు టీడీపీ ప్రయోజనాలను పరిరక్షించేలా తీర్పులిచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రకటనతో పాటు సీఎం రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ కల్లం శనివారం ఆలస్యంగా మీడియాకు విడుదల చేశారు. (జస్టిస్‌ రమణ ఆస్తులు, దమ్మాలపాటి కేసుల్లో ఇచ్చిన తీర్పుల వివరాల తాలూకు పత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top