Minister Ambati Rambabu fires on Kotamreddy Sridhar Reddy - Sakshi
Sakshi News home page

అసెంబ్లీకి అందుకే వచ్చావా?.. కోటంరెడ్డిపై మంత్రి అంబటి ఫైర్‌

Mar 15 2023 9:33 AM | Updated on Mar 15 2023 10:43 AM

Minister Ambati Rambabu Fires On Kotamreddy Sridhar Reddy - Sakshi

సాక్షి, అమరావతి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే వచ్చారంటూ దుయ్యబట్టారు. శ్రీధర్‌రెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా?. కోటంరెడ్డి నమ్మకద్రోహి.. చంద్రబాబు, టీడీపీ కోసం ఆయన పని చేస్తున్నారని అంబటి నిప్పులు చెరిగారు.

‘‘శ్రీధర్‌రెడ్డి.. టీడీపీతో చేతులు కలిపారు. దురుద్దేశ్యంతోనే కోటంరెడ్డి ఆందోళన చేస్తున్నాడు. నైతిక విలువలేని వ్యక్తి శ్రీధర్‌రెడ్డి. చంద్రబాబు మెప్పుకోసం కోటంరెడ్డి మాట్లాడుతున్నాడు. నమ్మకద్రోహం చేసినవారికి పుట్టగతులు లేకుండా పోతాయి’’ అంటూ మంత్రి అంబటి నిప్పులు చెరిగారు.

ఎలా  ప్రస్తావించాలో తెలుసుకోవాలి: మంత్రి బుగ్గన
వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. ‘‘ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సంబంధింత మంత్రులు, అధికారులకు వినతిపత్రం ఇస్తే పరిష్కరిస్తాం. ఎక్కడ ఏ వేదిక మీద ఎలా  ప్రస్తావించాలో తెలుసుకోవాలి’’ అంటూ మంత్రి బుగ్గన హితవు పలికారు. 

Advertisement
 
Advertisement
Advertisement