చంద్రబాబుకు నిలువెల్లా విషమే: లక్ష్మీపార్వతి ఆగ్రహం | Lakshmi Parvathi Serious On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు నిలువెల్లా విషమే: లక్ష్మీపార్వతి ఆగ్రహం

Sep 22 2024 12:23 PM | Updated on Sep 22 2024 12:36 PM

Lakshmi Parvathi Serious On Chandrababu Naidu

సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికైనా వెనుకాడడు అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

లక్ష్మీపార్వతి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఇవాళ దేవుడితో ఆటలాడుతున్నాడు. లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ నెయ్యి వాడలేదు. ఇది వందల ఏళ్లుగా అనవాయితీగా వస్తోంది. చంద్రబాబు హయాంలో నెయ్యిలో కల్తీ జరిగితే వైఎస్‌ జగన్‌పై నింద వేస్తున్నారు. చంద్రబాబు వల్ల తిరుమల గోవిందుడికి  కళంకం వచ్చింది. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు ఎంత నీచానికి అయిన వెనుకాడడు. చంద్రబాబుకు నిలువెల్లా విషమే ఉంటుంది’ అంటూ విమర్శించారు. 

ఇది కూడా చదవండి: తిరుమల లడ్డూపై మరో మారు చంద్రబాబు అబద్ధాలు
 

Advertisement
 
Advertisement
Advertisement