‘చంద్రబాబుకు దృష్టిలోపం.. అందుకే పేదల వైపు చూడలేకపోయాడు’

Kurasala Kannababu Satires On Chandrababu At Kakinada - Sakshi

సాక్షి, కాకినాడ: చంద్రబాబు అవినీతి కేంద్ర సంస్థలే బయటపెట్టాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. స్కీంల పేరుతో చంద్రబాబు అంతా దోచేశారని, ఆయన్ను కక్షపూరితంగా అరెస్ట్‌ చేయలేదని చెప్పారు. పక్కా ఆధారాలతోనే చంద్రబాబు జైలుకు వెళ్లారని పేర్కొన్నారు. బాబు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. 

‘ఏపీ శ్రీలకంలా మారుతుందంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకాన్ని సీఎం జగన్‌ నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను సిఎం జగన్  కలుపుకుని వెళ్ళున్నారు. గురువారం నుంచి ‘ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ఎందుకు కావాలి’  ప్రారంభం అవుతుంది.  చంద్రబాబు కోసం అబద్దాలు చెప్పి ఎల్లో మీడియా ప్రజల్ని భమల్లోకి తీసుకువెళ్లాయి. ఆ భ్రమల్లో నుంచి ప్రజలు బయటకు వచ్చారు.  జగనే ఎందుకు కావాలి అని చెప్పకపోతే.. అబద్దాల చంద్రబాబు నిజం అని ప్రజలు నమ్ముతారు.

చంద్రబాబును అరెస్ట్ చేస్తే భూకంపం వస్తుందని టీడీపీ బిల్డప్ ఇచ్చింది. బాబు అరెస్ట్ అయితే చిన్న ప్రకంపనం కూడా రాలేదే.  చంద్రబాబుకే గ్యారంటీ లేదు, వచ్చి వాయన ఎవరికి గ్యారంటీ ఇస్తారు. గవర్నర్‌కు కూడా అబద్దాలు చెబుతున్నారు. ఈఎస్ఐ స్కామ్‌లో వందల కోట్లు లాగేసినా అరెస్ట్ చేయ్యకుడదా?.  తాగుబోతులకు మంచి బ్రాండ్‌లు దొరకడం లేదని టీడీపీ భాధపడుతుంది. చేసేదంతా చేసి.. ఆ బురదను టీడీపీ ఎదుట వాళ్ళ మీద చల్లుతుంది.

చంద్రబాబుకు ఎప్పుడూ దృష్టి లోపం ఉంది. అందుకే పేదల పక్షం వైపు చూడలేకపోయాడు. తన మ్యానిపెస్టోను చదువుకోలేకపోయాడు. బాబుకు, వైఎస్‌ జగన్‌కు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒక బలవంతుడు, ధైర్యవంతుడిని ఢీ కొట్టాలంటే పదిమంది కలిసి వస్తారు. సీఎం జగన్‌ వచ్చే ఎన్నికలకు ఒంటరిగా దైర్యంగా వెళ్తున్నారు. చంద్రబాబు ఏనాడైన జర్నలిస్టులకు సెంటు స్ధలం ఇచ్చాడా?. చంద్రబాబు పత్రికా యాజమాన్యాలను చూస్తాడు.. కలం కార్మికులను గుర్తించి మూడు సెంట్లు స్ధలాలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. యాజమాన్యాల వైపు చంద్రబాబు ఉంటే.. జర్నలిస్టుల వైపు జగన్ ఉన్నారు’ అని కురసాల కన్నబాబు పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top