‘జమిలి’తో ప్రభుత్వాలు రద్దేనా?: కేటీఆర్‌ | Ktr Response On One Nation One Election Cabinet Approval | Sakshi
Sakshi News home page

‘జమిలి’ ఎన్నికలతో ప్రభుత్వాలు రద్దేనా?: కేటీఆర్‌

Sep 18 2024 8:39 PM | Updated on Sep 19 2024 10:05 AM

Ktr Response On One Nation One Election Cabinet Approval

సాక్షి,హైదరాబాద్‌: జమిలి ఎన్నికలపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. వచ్చే ఎన్నికల కోసం దేశంలోని అన్ని ప్రభుత్వాలను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. జమిలి ఎన్నికలపై పార్టీ నేతలమంతా కూర్చొని చర్చించి నిర్ణయం చెబుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలను మోసం చేస్తోందని కేటీఆర్‌ విమర్శించారు. బుధవారం(సెప్టెంబర్‌18) కేటీఆర్‌ తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ బీసీ నేతలతో సమావేశమై మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరిట చేసిన మోసంపై పార్టీ బీసీ నేతల సమావేశంలో చర్చించాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసే దాకా కాంగ్రెస్‌ను నిలదీస్తాం. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి.సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించాలి.నవంబర్ 10 లోపు పూర్తి చేయని పక్షంలో బీసీల తరఫున ఎలా ముందుకు పోతామో కార్యాచరణ ప్రకటిస్తాం.

అవరసరం అయితే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతాం.బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పి ఎనిమిది వేల కోట్లు మాత్రమే బడ్జెట్‌లో పెట్టారు.బీసీ సబ్ ప్లాన్ పెట్టాలి.25 నుంచి 35 వేల కోట్లు అందులో పెట్టాలి.ఎమ్మెల్సీ మధుసూదనా చారి నేతృత్వంలో తమిళనాడు వెళ్లి బీసీ స్కీమ్‌లపై అధ్యయనం చేయాలని నిర్ణయించాం. కేవలం ఇద్దరు బీసీ మంత్రులు మాత్రమే కేబినెట్‌లో ఉన్నారు. ఎంబీసీలకు మంత్రి పదవి ఇవ్వాలి. బీఆర్‌ఎస్‌ బీసీల కోసం కదులుతుంది’అని కేటీఆర్‌ తెలిపారు. 

ఇదీ చదవండి.. జమిలికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement