Kishan Reddy: ‘ప్రతీ గ్రామానికి మోదీ ప్రభుత్వం నిధులు ఇస్తున్నది’ 

Kishan Reddy Serious On TRS Government For Singareni Privatization - Sakshi

సాక్షి, పెద్దపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, బీజేపీ నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘ఈ ఫ్యాక్టరీతో ఎరువుల కొరత తీరుతుంది. యూరియా బస్తాపై కేంద్రం రూ. 1470 సబ్సిడీ ఇస్తోంది. 2014లో ధాన్యానికి మద్దతు ధర రూ. 1360 ఉండేది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రూ.2040కి ధరను మోదీ పెంచారు. గతంలో తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు రూ. 3404 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు 26వేల కోట్లు కేటాయించాము. 

రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తూ రామగుండంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మిస్తాము. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సింగరేణి ప్రైవేటీకరణతో కేంద్రానికి సంబంధం లేదు. ప్రతీ గ్రామానికి మోదీ ప్రభుత్వం నిధులు ఇస్తుంది కాబట్టే.. గ్రామీణ ‍ప్రాంతాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. రైతుల అకౌంట్లలో ఏడాదికి రూ. 6వేలు జమ చేస్తున్నాము’ అని అన్నారు. 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top