
సాక్షి, హైదరాబాద్: అధికారానికి వచ్చిన మూడురోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ అసలు రంగు బయటపడిందని కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మజ్లిస్ దోస్తీతో తన పాత అలవాటు ప్రకారం శాసనసభ నియమాలు, విధానాలు, గౌరవాన్ని కాలరాసేందుకు ప్రయత్నించిందన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు బొటా»ొటీ మెజారిటీ ఉన్నదని, తుమ్మినా, దగ్గినా కూలిపోయే పరిస్థితిలో ప్రభుత్వం కొలువుదీరిందన్నారు.
శనివారం పార్టీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, ధన్‌పాల్ సూర్యనారాయణ, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్‌బాబు, పైడి రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డితో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందేమోనని మజ్లిస్‌మద్దతు కోసం ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రొటెం స్పీకర్‌గాఅవకాశం ఇచ్చిందని ఆరోపించారు.
శాసనసభలో ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యేను నియమించే సంప్రదాయాన్ని కాదని మజ్లిస్‌కు చెందిన వ్యక్తిని నియమించి నియమాలను తుంగలో తొక్కిందని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, మజ్లిస్‌లు ఒకటేనని తాము ముందు నుంచి చెబుతూ వస్తున్నామన్నారు. రెగ్యులర్‌స్పీకర్‌బాధ్యతలు చేపట్టిన తర్వాతనే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.