జేసీవి దిగజారుడు రాజకీయాలు: కేతిరెడ్డి పెద్దారెడ్డి | Sakshi
Sakshi News home page

జేసీవి దిగజారుడు రాజకీయాలు: కేతిరెడ్డి పెద్దారెడ్డి

Published Wed, Dec 27 2023 2:04 PM

Kethireddy Pedda Reddy Comments On JC Prabhakar Reddy - Sakshi

అనంతపురం: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. తనపైన కరపత్రాలు వేసి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉనికి కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న చీడ పురుగులను ఏరేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.

'జెండాలు తొలగించకుండా సుందరీకరణ పనులు చేస్తామని జేసీ లేఖ ఇచ్చారు. ఇప్పుడేమో వైఎస్సార్ సీపీ జెండాలు తొలగించాలని జేసీ ఆందోళన చేయడం హాస్యాస్పదం. జేసీ  బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. అవినీతి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం. బినామీ పేర్లతో తాడిపత్రి మున్సిపల్ ఆస్తులను జేసీ కొల్లగొట్టారు. నోరు జారితే ఊరుకునేది లేదు. జేసీ వర్గీయులు నా ఓర్పును పరీక్షించవద్దు. తాడిపత్రిలో గొడవలు సృష్టించి సానుభూతి పొందేందుకు కుట్రలు చేస్తున్నారు.'  అని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. 

ఇదీ చదవండి: బాబును ప్రజలు ఫుట్‌బాల్‌ ఆడుతారు: మంత్రి రోజా

Advertisement
 
Advertisement
 
Advertisement