కర్ణాటక సీఎంపై గవర్నర్‌కు మంత్రి ఫిర్యాదు | Karnataka minister Eshwarappa complains to Governor against Yediyurappa | Sakshi
Sakshi News home page

కర్ణాటక సీఎంపై గవర్నర్‌కు మంత్రి ఫిర్యాదు

Apr 1 2021 6:16 AM | Updated on Apr 1 2021 6:16 AM

Karnataka minister Eshwarappa complains to Governor against Yediyurappa  - Sakshi

బెంగళూరు:  కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్‌.ఈశ్వరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప తీరుపై బుధవారం గవర్నర్‌ వజూభాయ్‌ వాలాకు ఫిర్యాదు చేశారు. తన శాఖ వ్యవహారాల్లో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఐదు పేజీల ఫిర్యాదు పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించారు. తన శాఖకు సంబంధించిన పలు పరిపాలనా సంబంధమైన అంశాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాలని ఈశ్వరప్ప చెప్పారు. తనకు తెలియకుండానే తన శాఖ నుంచి ముఖ్యమంత్రి నిధులు విడుదల చేస్తున్నారని విమర్శించారు. యడియూరప్పకు సన్నిహితుడిగా ఈశ్వరప్ప పేరు పొందారు. ఇటీవల ఇరువురి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement