ఆ దమ్ము సోమిరెడ్డికి ఉందా?.. కాకాణి సవాల్‌ | Kakani Govardhan Reddy Challenges Mla Somireddy | Sakshi
Sakshi News home page

ఆ దమ్ము సోమిరెడ్డికి ఉందా?.. కాకాణి సవాల్‌

Feb 12 2025 3:50 PM | Updated on Feb 12 2025 4:06 PM

Kakani Govardhan Reddy Challenges Mla Somireddy

ఈ భూములపై సీబీసీఐడీ అధికారులు చేత విచారణ జరిపించే దమ్ము సోమిరెడ్డికి ఉందా?

సాక్షి, నెల్లూరు: సోమిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో రామదాసు కండ్రిగలోని పేదల దగ్గర భూములు తక్కువకు కొనుగోలు చేసాడని.. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారాన్ని  కొట్టేశారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, ఎల్లో మీడియాపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ఈ భూములపై సీబీసీఐడీ అధికారులు చేత విచారణ జరిపించే దమ్ము సోమిరెడ్డికి ఉందా? నాఫై సోమిరెడ్డి 17 విజిలెన్స్ ఎంక్వరీ చేయించాడు.. తప్పుడు కేసులు పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. క్రిభో పరిశ్రమ వెళ్లిపోవడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే కారణం.

..కమిషన్ల కోసం సోమిరెడ్డి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నాడు. ఉద్యోగుల బదిలీల్లో కూడా సోమిరెడ్డి లక్షల రూపాయలు దండుకుంటున్నాడు. టీడీపీ హయాంలోనే రామదాస్ కండ్రిగ భూముల్లో అవినీతి జరిగింది.. దానిపై విచారణ జరిపే దమ్ము సీఎం చంద్రబాబుకి కూడా లేదు. కుటుంబాల్లో కలతలు వచ్చేలా ఎల్లో మీడియా వార్తలు రాస్తోంది. ఈ భూముల విలువల్లో 10 శాతం ఇప్పించగలిగితే వచ్చే ఎన్నికల్లో పోటీ  చేయను’’ అని కాకాణి సవాల్ విసిరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement