జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్‌’ ఖాతా నిలిపివేత | Jharkhand Congress X handle withheld for Amit Shah deepfake video | Sakshi
Sakshi News home page

జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్‌’ ఖాతా నిలిపివేత

May 2 2024 10:50 AM | Updated on May 2 2024 11:09 AM

Jharkhand Congress X handle withheld for Amit Shah deepfake video

న్యూఢిల్లీ, సాక్షి: జార్ఖండ్ కాంగ్రెస్ ఖాతాను ‘ఎక్స్‌’ (ట్విటర్‌) నిలిపివేసింది. చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఎక్స్‌ ఈ చర్య తీసుకున్నట్లు వార్తా సంస్థ ఏఎస్‌ఐ నివేదించింది. ఈ హ్యాండిల్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సంబంధించిన 'డీప్‌ఫేక్ మార్ఫ్‌డ్‌ వీడియో' పోస్ట్ చేసిన తర్వాత ఖాతాను ‘ఎక్స్‌’ నిలిపివేసింది.

మరోవైపు జార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్‌కు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బుధవారం తెల్లవారుజామున సీఆర్‌పీసీ సెక్షన్ 91 కింద నోటీసు జారీ చేసింది. మే 2న సెల్ కార్యాలయంలో హాజరు కావాలని కోరింది. ‘ఢిల్లీ పోలీసుల నుండి నోటీసు అందింది. కానీ నాకు ఎందుకు నోటీసు ఇచ్చారో అర్థం కాలేదు. ఇది అరాచకం తప్ప మరొకటి కాదు’ అని ఠాకూర్‌ స్పందించినట్లుగా పీటీఐ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement