టీడీపీతో కలిసి పనిచేసే పరిస్థితి లేదు | Jana Sena Leader Says No Scope for Working with TDP After Worker’s Death in Kadapa | Sakshi
Sakshi News home page

టీడీపీతో కలిసి పనిచేసే పరిస్థితి లేదు

Nov 23 2026 9:26 AM | Updated on Nov 23 2026 9:26 AM

Jana Sena Leader Says No Scope for Working with TDP After Worker’s Death in Kadapa

వైఎస్‌ఆర్ కడప జిల్లా : జనసేన కార్యకర్త వీరాంజనేయులు ఆర్వో కార్యాలయం ఎదుట జరిగిన తోపులాట కారణంగానే మృతి చెందాడని.. టీడీపీతో కలిసి పని చేసే పరిస్థితి లేదని ఆ పార్టీ నేత, ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శివ శ్రీనివాస రావు అన్నారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు ఆదివారం ఆయన చక్రాయపేట మండలం నాగలగుట్టపల్లెలో టీడీపీ అరాచకాలకు బలైన వీరాంజనేయులు మృతదేహానికి నివాళులు అర్పించారు. 

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో 15 ఏళ్లు కలసి పని చేయాలనుకుంటే క్షేత్ర స్థాయిలో ఆపరిస్థితి కనిపించలేదని చెప్పారు. పలు చోట్ల తమ పార్టీ శ్రేణులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. వీరాంజనేయులు మృతి కూడా ఈ కోవలోకే వస్తుందని, ఇందుకు కారణమైన వారిని వదిలేది లేదని చెప్పారు. క్షేత్ర స్థాయిలో జరిగే సంఘటనలపై పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు నివేదిక సమరి్పస్తామన్నారు. వీరాంజనేయులు మృతిపై విచారణ కోరుతూ జిల్లా కలెక్టర్, ఎస్పీని కూడా కలుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి పార్టీ తరఫున రూ.5 లక్షల చెక్కును అందజేశారు.  

ఇదీ చదవండి: షర్మిల వద్ద ఒక్క ఆధారమైనా ఉందా?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement