పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం గోబెల్స్‌ ప్రచారం: హరీశ్‌  | Harish Rao Slams On Central Govt Over Goebbels Propaganda | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం గోబెల్స్‌ ప్రచారం: హరీశ్‌ 

Mar 26 2022 3:22 AM | Updated on Mar 26 2022 3:22 AM

Harish Rao Slams On Central Govt Over Goebbels Propaganda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశా రు. తెలంగాణలో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పదే పదే పచ్చి అబద్ధాలు చెబుతోందని ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. ‘‘కేంద్రం పార్లమెంట్‌ సాక్షిగా గోబెల్స్‌ ప్రచారానికి దిగింది. మొన్న గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ నుంచి రాలేదని చెప్పిన కేంద్రం.. ఈ రోజు మెడికల్‌ కాలేజీల ఏర్పా టుపైనా లోక్‌సభ వేదికగా దుష్ప్రచారం చేస్తోంది.

తెలంగాణ నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ పవార్‌ పార్లమెంట్‌లో చెప్పడం బాధాకరం. మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది.

అయినా మంత్రులు పార్లమెంట్‌ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతూ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’’అని హరీశ్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement