వైఎస్‌ జగన్‌ హయాంలోనే మాదిగలకు మేలు జరిగింది: ఆదిమూలపు సురేష్‌ | Former Minister Adimulapu Suresh Pressmeet On Sc classification Issue | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ హయాంలోనే మాదిగలకు మేలు జరిగింది: ఆదిమూలపు సురేష్‌

Nov 18 2024 2:54 PM | Updated on Nov 18 2024 3:51 PM

Former Minister Adimulapu Suresh Pressmeet On Sc classification Issue

సాక్షి,తాడేపల్లి:వైఎస్‌ జగన్ హయాంలోనే ఏపీలో మాదిగలకు చాలా మేలు జరిగిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సోమవారం(నవంబర్‌ 18) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ఆఫీసులో పార్టీ అధికార ప్రతినిధి కొమ్మూరి కనకారావుతో కలిసి సురేష్‌ మీడియాతో మాట్లాడారు.

‘మంద కృష్ణ మాదిగ మాత్రం చంద్రబాబు పల్లకి మోస్తూ కాలం గడుపుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత లేదని చంద్రబాబు అంటుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు?అంటే ఈ సమస్య ఎప్పటికీ ఇలాగే ఉండాలని మంద కృష్ణ కోరుకుంటున్నారు. అందుకే కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారు. మాదిగలకు న్యాయం జరిగేదానికంటే రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు,మంద కృష్ణ చూస్తున్నారు.

మాల,మాదిగలను రెండు కళ్లుగా వైఎస్‌ జగన్ చూశారు. చంద్రబాబులాగ రాజకీయాలకు వాడుకోలేదు.సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా అమలు చేసేలా మంద కృష్ణ చూడాలి. అంతేగానీ వైఎస్‌ జగన్‌ని దూషిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో అలజడి సృష్టించాలంటే కుదరదు.అన్ని ఉద్యోగాలలో దామాషా ప్రకారం మాదిగలకు దక్కేలా చూడాలి. కమిటీల పేరుతో కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తే సహించం.

కూటమి ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తోంది

కొమ్మూరి కనకారావు కామెంట్స్‌...

  • మంద కృష్ణమాదిగ చంద్రబాబు చేతిలో పనిముట్టులాగ మారాడు
  • వర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగలను రాజకీయంగా వాడుకుంటున్నారు
  • ముప్పై ఏళ్లుగా మంద కృష్ణ చేస్తున్నది అదే
  • మాల, మాదిగల మధ్య వివాదాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు
  • రెండు వర్గాల మధ్య మంటలు రాజేసి చలి కాసుకుంటున్నాడు
  • పెద్ద మాదిగలాగ ఉంటానన్న చంద్రబాబు అధికారంలో ఉన్నంతవరకు ఏమీ చేయలేదు
  • మరి చంద్రబాబుకు మళ్ళీ ఎందుకు మద్దతు చెప్తున్నావ్?
  • ఇద్దరి మధ్య ఉన్న లాలూచీ ఏంటి?
  • చంద్రబాబు ఇచ్చిన టాస్క్ ప్రకారం జగన్‌ను దూషించడంంకరెక్టు కాదు
  • వైఎస్‌ జగన్ మాత్రమే మాదిగని ఎంపీ చేశారు
  • ఇద్దరు మాదిగలకు కీలకమైన మంత్రి పదవులు వైఎస్‌ జగన్ ఇచ్చారు
  • చంద్రబాబు ముగ్గురికే నామినేట్ పదవులు ఇస్తే, వైఎస్‌ జగన్ ఏకంగా ఏడుగురికి పదవులు ఇచ్చారు
  • చర్మకారులు, డప్పు కళాకారులకు వైఎస్‌ జగన్ పెన్షన్లు ఇచ్చారు
  • చంద్రబాబు ఆ పెన్షన్లు చంద్రబాబు తొలగిస్తుంటే మంద కృష్ణ ఏం చేస్తున్నారు?
  • చంద్రబాబు ప్రభుత్వంలో మాదిగలకు రక్షణ లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement