కాంగ్రెస్‌కు మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ రాజీనామా

Former Maharashtra Minister Baba Siddique Resigns From Congress - Sakshi

ముంబయి: మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాబా సిద్ధిఖ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దాదాపు 48 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. చెప్పడానికి చాలా ఉన్నాయి.. కానీ కొన్ని చెప్పకపోవడమే మంచిదని పేర్కొంటూ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలోని వాండ్రే పశ్చిమ విధానసభ నియోజకవర్గానికి శాసనసభ సభ్యుడుగా సిద్ధిఖ్ పనిచేశారు.

 ఇటీవల మహారాష్ట్ర కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ మాజీ మంత్రి మిలింద్‌ దేవరా షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. మిలింద్ కూడా సీనియర్ నాయకుడే. ఆయన తర్వాత మరో సీనియర్ నేత సిద్ధిఖ్ పార్టీని వీడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో వరుసగా పదేండ్లపాటు అధికారానికి దూరంగా ఉండటంతోపాటు సాధారణ ఎన్నికల్లో మళ్లీ గెలిచే అవకాశం లేకపోవడంతో పార్టీ సీనియర్‌ నాయకులు ఒక్కొక్కరిగా తమదారి తాము చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

ఇదీ చదవండి: కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం : ఎంపీ విజయసాయిరెడ్డి

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top