ప్రగతిపై గొప్ప విజన్‌ ఉన్న నేత కేటీఆర్‌ 

Former Karnataka CM HD Kumaraswamy Meet Telangana Minister KTR - Sakshi

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అభివృద్ధిపై గొప్ప విజన్‌ ఉన్న నేత అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌.డి.కుమారస్వామి అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో జరిగిన సమావేశం అర్థవంతంగా సాగిందని ఆయన ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

ఈ సందర్భంగా కర్ణాటక – తెలంగాణ రాష్ట్రాల సమస్యలు, జాతీయ రాజకీయాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కేటీఆర్‌ అందించిన ఆతిథ్యం, చూపించిన అభిమానంతో తన హృదయం నిండిపోయిందని కుమారస్వామి పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top